మరోసారి చార్జీలు పెంచిన టీఎస్ ఆర్టీసీ.. ఈసారి ట్రావెల్‌ 24 టికెట్‌ రేట్లు పెంపు

Hyderabad TSRTC Once Again Hikes Charges This Time For Travel 24 Tickets Prices, TSRTC Ticket Rates, TSRTC hikes ticket fare, TSRTC bus fare hike comes into effect, TSRTC Likely to Hike Ticket Fare, TSRTC Once Again Hikes Charges, Time For Travel 24 Tickets Prices, 24 Tickets Prices, Telangana State Road Transport Corporation, Telangana State Road Transport Corporation Once Again Hikes Charges This Time For Travel 24 Tickets Prices, TSRTC Once Again Hikes Ticket Rates, TSRTC Hikes Ticket Rates, TSRTC Hikes Ticket Rates News, TSRTC Hikes Ticket Rates Latest News, TSRTC Hikes Ticket Rates Latest Updates, TSRTC Hikes Ticket Rates Live Updates, Hyderabad TSRTC, Mango News, Mango News Telugu,

తెలంగాణ ఆర్టీసీ మరోసారి చార్జీలు పెంచి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. అయితే ఈసారి ట్రావెల్‌ 24 టికెట్‌ల ధరలు పెంచింది. హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్సుల్లో ట్రావెల్‌ 24 టికెట్‌ చార్జీలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. సేఫ్టీ, డీజిల్‌ సెస్‌ల పేరుతో సాధారణ టికెట్ల ధరలు రూ.5 నుంచి రూ. 10 వరకు ఇప్పటికే పెరగగా, ఇప్పుడు ట్రావెల్‌ 24 టికెట్ల వంతు వచ్చింది. కాగా గత కొంత కాలంగా ఈ ట్రావెల్‌ 24 టికెట్‌లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఎందుకంటే, ట్రావెల్‌ 24 టికెట్‌ తీసుకుంటే 24 గంటల పాటు నగరంలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు. తాజాగా ఆ టికెట్‌ ధరను రూ.100 నుంచి రూ.120కి పెంచుతూ ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

అయితే పెరిగిన రేట్లు ఈరోజు నుంచే అమలులోకి రానున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఒక నెల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో చార్జీలను పెంచారు. ఎక్స్‌ప్రెస్ మరియు డీలక్స్ బస్సు సర్వీసులకు సెస్ రూ.1 నుంచి రూ.5కి పెంచగా.. రాజధాని, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల వంటి అత్యాధునిక సర్వీసులకు రూ.1 నుంచి రూ.10కి పెంచిన విషయం తెలిసిందే. స్పేర్ పార్ట్స్, ట్యూబ్‌లు, టైర్లు, డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో పెంపు అనివార్యమని కార్పొరేషన్ అధికారులు చార్జీల పెంపుపై తమ వాదనను వినిపిస్తున్నారు. సంస్థకు సగటు రోజువారీ ఆదాయం రూ.12 కోట్లు దాటకపోయినా డీజిల్ మరియు ఇతర అవసరాలకు రోజుకు రూ.16 కోట్లు వెచ్చించాల్సి వస్తోందని ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here