దేశవ్యాప్తంగా ఎక్కువ ఎత్తుతో గణేశ్‌లను ప్రతిష్టించినా.. లేదా డిఫరెంట్‌గా గణపతిని తయారు చేసినా కూడా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేశుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాడు. 70ఏళ్ల నుంచి ఖైరతాబాద్ వినాయకుడిని పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతికి వచ్చిన ఆదాయాన్ని చూసి నిర్వాహకులు కూడా షాక్ అయ్యారు. ఖైరతాబాద్ వినాయకుడు ఈ సారి ఆదాయంలో రికార్డ్స్ బద్దలు కొట్టాడు.
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా వినాయకుడి గురించి ఎవరికీ ప్రత్యేక గురించి చెప్పక్కర్లేదు. వినాయక చవితి అనగానే ఖైరతాబాద్ వినాయకుడే గుర్తుకువస్తాడు. మనదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో సైతం ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ప్రజాదరణ పొందాడు. ప్రతీ ఏడాదికి ఒక్క అడుగు ఎత్తున పెంచుకుంటూ వస్తున్నారు. ఈసారి ఖైరతాబాద్ లో గణేషుడిని ప్రతిష్టించి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా.. నిర్వాహకులు 70 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు లక్షాలాదిగా భక్తులు తరలివచ్చారు. 9 రోజుల పాటు భక్తులచే పూజలందుకున్న మహాగణనాధుడు పదవ రోజున గంగమ్మ ఒడికి చేరుకోవడం ఆనవాయితీ కాబట్టటి..నేటితో ఖైరతాబాద్ గణేషుడి నవరాత్రులు ముగిశాయి. దీంతో నిర్వాహకులు గణేశుడి ఆదాయాన్ని లెక్కించారు.
మహాగణపతికి మొత్తం ఆదాయం రూ.1కోటి 10లక్షల వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఒక్క హుండీ ఆదాయమే రూ. 70లక్షల వచ్చిందని.. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షల ఆదాయం వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. అయితే మొట్టటమొదటిసారిగా ఖైరతాబాద్ లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీల లెక్కింపును చేపట్టారు.