బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ

Star Hero Junior NTR Meets Union Home Minister Amit Shah in Hyderabad, Junior NTR Meets Union Home Minister Amit Shah in Hyderabad, NTR Meets Amit Shah, Star Hero Junior NTR, Union Home Minister Amit Shah, Home Minister Amit Shah, Minister Amit Shah, Munugode By Election, Munugode By Poll, Junior NTR News, Junior NTR Latest News And Updates, Junior NTR Live Updates, Mango News, Mango News Telugu,

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ అయ్యారు. ఈ భేటీ హైదరాబాద్ శంషాబాద్‌ విమానాశ్రయంలోని నోవాటెల్‌ హోటల్ లో జరిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేరిక, ఉపఎన్నిక సందర్భంగా ‘మునుగోడు సమరభేరి’ పేరుతో ఆదివారం మునుగోడులో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగసభకు అమిత్ షా ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ పర్యటన సందర్భంగా అమిత్ షా ఆహ్వానం మేరకు జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అమిత్ షా, జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీ దాదాపు గంటపాటు సాగినట్టుగా తెలుస్తుంది. కాగా ముందుగా బీజేపీ నేతల సమక్షంలో ఈ భేటీ జరగ్గా, అనంతరం వారివురూ 20 నిమిషాలు పాటుగా ఏకాంతంగా చర్చించుకున్నట్టు సమాచారం. భేటీలో భాగంగా అమిత్ షా, ఎన్టీఆర్‌, బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి, తరుణ్‌ఛుగ్‌ లు కలిసి భోజనం చేశారు.

ముందుగా మునుగోడులో సభ ముగిశాక రాత్రి 10 గంటల తర్వాత అమిత్ షా శంషాబాద్‌ విమానాశ్రయంలోని నోవాటెల్‌ హోటల్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో నోవాటెల్ కు చేరుకున్న ఎన్టీఆర్‌ ను, పార్టీ కీలక నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అమిత్‌షా వద్దకు తీసుకెళ్లారు. అనంతరం ఎన్టీఆర్‌ కు అమిత్‌షా పుష్పగుచ్ఛం అందించి ఆహ్వానించగా, ఎన్టీఆర్‌ అమిత్‌షా కు శాలువా కప్పి సత్కరించారు. ఈభేటీలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటనను అమిత్ షా ప్రశంసించి, అభినందనలు తెలిపినట్టు తెలుస్తుంది. అలాగే దివంగత ముఖ్యమంత్రి, సినీ దిగ్గజం సీనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాల ప్రస్తావన, రాజకీయ ప్రస్తావన కూడా వచ్చినట్టు తెలుస్తుంది. కాగా ఈ భేటీలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వారివురూ ఏదైనా చర్చించారా? లేదా అనేది ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

ఎన్టీఆర్‌ తో భేటీ అనంతరం అమిత్‌ షా ట్వీట్ చేస్తూ, “అత్యంత ప్రతిభావంతుడైన నటుడు మరియు మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది” అని పేర్కొన్నారు. అదేవిధంగా జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్వీట్ చేస్తూ,”అమిత్ షా జీ…మిమ్మల్ని కలవడం మరియు సంతోషకరమైన ఇంటరాక్షన్ జరగడం చాలా ఆనందంగా ఉంది. మంచి మాటలకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 10 =