ఎస్పీ బాలు మరణం పట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం

#RIPSPB, #SPBalasubrahmanyam, balasubrahmanyam news, Demise of Singer SP Balasubrahmanyam, Legendary Singer SP Balasubrahmanyam, PM Modi Mourns for the Demise of Singer SP Balasubrahmanyam, President Kovind, SP Balasubrahmanyam dies, SP Balasubrahmanyam Passes Away, SP Balasubramaniam Death News, SP Balu Death, SP Balu Death News, SPB, SPB no more, SPB Passes away

గాన గంధర్వుడు, ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇతర రాజకీయ ప్రముఖులు, పలు సినీ పరిశ్రమలు అగ్రకథానాయకులు, సంగీత దర్శకులు, గాయకులు, రచయతలు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, అభిమానులు ఎస్పీ బాలు మృతి పట్ల సంతాపం తెలిపారు. ఎస్పీ బాలు లేని లోటు పూడ్చలేనిది పేర్కొంటూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మ్యూజిక్ లెజెండ్ ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం మరణంతో భారతీయ సంగీతం దాని అత్యంత శ్రావ్యమైన స్వరాన్ని కోల్పోయింది. అభిమానులు ‘సింగింగ్ మూన్’ అని పిలుచుకునే ఆయనకు పద్మ భూషణ్ మరియు అనేక జాతీయ అవార్డులు లభించాయి. ఆయన కుటుంబానికి, స్నేహితులకు సానుభూతిని తెలియజేస్తున్నాను – రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో మన సాంస్కృతిక ప్రపంచం చాలా పేదదయింది. అతని శ్రావ్యమైన స్వరం మరియు సంగీతం దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు అతని కుటుంబం మరియు ఆరాధకులతో ఉన్నాయి. ఓం శాంతి – ప్రధాని నరేంద్ర మోదీ

సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలు భారతీయ ప్రజలందరికీ అభిమాన గాయకులు అయ్యారని అన్నారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరమన్నారు. బాలసుబ్రహ్మణ్యం లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని సీఎం అన్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన సినీ లోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను – సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 12 =