సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా వుంది, త్వరలో కోలుకుంటారు: వైద్యులు

CM KCR, CM KCR to visit Yashoda Hospitals for a Medical check-up, CM KCR Went to Somajiguda Yashoda Hospital, CM KCR Went to Somajiguda Yashoda Hospital for Health Checkup and Tests, CM KCR’s health condition stable, KCR undergoes CT Scan, KCR Went to Somajiguda Yashoda Hospital, KCR Went to Somajiguda Yashoda Hospital for Health Checkup, Mango News, Telangana CM KCR, Telangana tense over Covid-hit KCR’s health

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు బుధవారం రాత్రి సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో సిటి స్కాన్ మరియు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం.వి.రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహించారు. సీఎం ఊపిరితిత్తులు సాధారణంగా వున్నాయని, ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలను సేకరించారు. రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు గురువారం రానున్నాయి. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా వుందని, త్వరలో కోలుకుంటారని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ యశోదా ఆసుపత్రికి వచ్చిన సమయంలో ఆయన వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ జె.సంతోష్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులున్నారు. మరోవైపు ఏప్రిల్ 19, సోమవారం నాడు సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ