ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల

Exit Polls Will Be Released This Evening, Ara Mastan Survey, Exit Polls, Exit Polls Will Be Released, Exit Polls Will Be Released This Evening, Lok Sabha Elections, Polling Figures,BJP,Lok Sabha Election,Telanaga Party,Political News,Telangana,Lok Sabha Election 2024,Ts Live Updates ,Hyderabad, BRS, Telangana Political Updates,Bhuvanagiri,Congress,Modi,
Exit polls will be released this evening,Exit polls will be released,Exit polls,Ara Mastan Survey

జూన్ నెల వచ్చేసింది. మరో మూడు రోజుల్లో రాబోయే ఫలితాల కోసం కౌంట్ డౌన్ మొదలయింది.  రాజకీయ నాయకులే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో మే 13 న జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారోనన్న దానిపై  అందరికీ ఉత్కంఠ పెరిగిపోతుంది. అయితే ఫలితాల కంటే ముందు కొన్ని సర్వే సంస్థలు ఈ రోజు ప్రకటించబోయే ఫలితాలపై ఆసక్తి నెలకొంది.

మరోవైపు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై అన్ని రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన ఎన్డీఏలో చేరడంతో ఈ ఆసక్తి మరింతగా పెరిగిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఒకవిధంగా చెప్పాలంటే ఈ పొత్తు వల్లే  ఏపీ ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేని విధంగా జరిగినట్లుగా కథనాలు కూడా వచ్చాయి. ఈ ఎన్నికల్లో కులం, ధనం ప్రధాన పాత్ర పోషించేలా నేతలంతా  ఓటర్లను ప్రలోభపెట్టారు. మరికొంతమంది తామే స్వయంగా తమ అభిమాన నేత కోసం  దేశ విదేశాల నుంచి ఓటర్లు వచ్చి ఓటు వేశారు.

మరోవైపు ఈ రోజు అంటే జూన్ 1 సాయంత్రం 6 తరువాత సర్వే సంస్థలన్నీ తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించుకోవచ్చని ఎన్నికల సంఘం అనుమతించింది. దీంతో ఈ రోజు సాయంత్రం పోస్ట్ పోల్ ఎగ్జిట్ ఫలితాలు ప్రకటించడానికి కొన్ని  ప్రముఖ సర్వే సంస్థలు సిద్ధమవుతున్నాయి. అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాల గురించి ఆరా సంస్థ ముందుగా ప్రకటించిన సర్వేలో చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో నిలిచింది.  దీంతో ఆరా మస్తాన్ సర్వే ఫలితాలు ఏపీలో  ఎలా ఉన్నాయని ప్రకటిస్తుందా అన్న ఆసక్తి  చాలా మందిలో  నెలకొంది.

చిలకలూరిపేట సమీపంలో ఉన్న తన స్వస్థలం మద్దిరాలలో ఆరా మస్తాన్ ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఎన్నికల ముందు నుంచి  కొన్ని సంస్థలు రకరకాల పేర్లతో టీడీపీ గెలుస్తుందని కొన్ని, వైసీపీ గెలుస్తుందని మరికొన్ని  ఊదర గొట్టినా ఈ ఫలితాలను ప్రజలెవరూ పెద్దగా నమ్మలేదు.

ఐతే జాతీయ మీడియా సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై సర్వేలు చేసి ముందుగానే ఫలితాలు ప్రకటించాయి. ఏపీలో ఎన్డీయే కూటమి ఉండటంతో వాటిలో ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థలు కూడా సర్వేలు నిర్వహించాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశ ముగిసాక.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు నేషనల్, లోకల్ మీడియా, సర్వే సంస్థలు తమ అంచనాలను ప్రకటించనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY