ముస్లింల అండ పువ్వాడకా, తుమ్మలకా?

Anda Puvvada or Tummalaka of Muslims,Anda Puvvada or Tummalaka,Tummalaka of Muslims,Anda Puvvada of Muslims,Tummala vs Puvvada,Tummala, Puvvada, key leader,Khammam, Muslims, votes,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,Mango News,Mango News Telugu,Telangana Elections,Telangana Latest News And Updates,Telangana Election Latest Updates,Telangana Politics, Telangana Political News And Updates
Tummala vs Puvvada,Tummala, Puvvada, key leader,Khammam, Muslims, votes,Telangana Assembly Elections 2023,assembly seat, BJP,BRS, Congress,

భిన్న రాజకీయాలకు వేదికగా పేరుబడ్డ ఖమ్మం నియోజకవర్గంలో.. రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. నిన్నటి వరకు బీఆర్‌ఎస్‌లో ఉండి తాజాగా కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఖమ్మంలో తలపడుతున్నారు. తుమ్మల విశేషమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిగా పేరు బడ్డారు. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మంత్రివర్గంలో  పని చేసిన అనుభవం ఉంది.

బీఆర్‌ఎస్‌ టికెట్ ఆశించి భంగపడిన తుమ్మల.. తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో కొత్త మంత్రి పువ్వాడ, మాజీ మంత్రి తుమ్మల  మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా తుమ్మల.. పువ్వాడ అజయ్‌ను ఖాసీం రజ్వీతో పోల్చడం రాజకీయంగా పెను దుమారాన్నే రేపింది.  దీంతో  అహంకార రాజకీయాలకు తుమ్మల నాగేశ్వరరావు కేరాఫ్ అడ్రస్ అంటూ పువ్వాడ సమాధానమిచ్చారు.

ఖమ్మం నియోజకవర్గంలో మూడు లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. నేతల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుండటంతో ఎవరు గెలిచినా కూడా పది వేల మెజారిటీ మాత్రమే వచ్చే పరిస్థితులు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇక్కడ  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ కొనసాగుతుందనే చర్చ బలంగా సాగుతోంది.

మాజీ మంత్రి తుమ్మల  2009లో టీడీపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ సీఎం తనయుడు జలగామ వెంకట్రావుపై విజయం సాధించారు.  2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసిన తుమ్మలపై కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ గెలిచారు.

అలాగే  2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పువ్వాడ అజయ్ కుమార్..ఖమ్మం జిల్లాకు చెందిన ఏకైక ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ  ఇద్దరు నేతలు మరోసారి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయడంతో రాజకీయంగా ఖమ్మం నియోజకవర్గంలో గెలుపుపై అందరి ఆసక్తి పెరిగింది. ఖమ్మం సీటులో ఎవరు గెలిచినా కూడా 10 వేల స్వల్ప మెజారిటీతో మాత్రమే గెలుపొందే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 40 వేల ఓట్లు ముస్లీం మైనార్టీవి కాగా.. మూడు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.  దీంతో ఇక్కడ  ఎవరు గెలిచినా.. ఎవరు ఓడిపోయినా దానికి ముస్లీం మైనార్టీలే కారణం అవనుంది. దీంతో ఈ ద్విముఖ పోటీలో ముస్లీం మైనారిటీలను ప్రసన్నం చేసుకోవడానికి నేతలిద్దరూ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

ఖమ్మం నియోజవర్గంలో  ముస్లిం మైనార్టీల  ఓట్లు అభ్యర్థుల గెలుపునకు అత్యంత కీలకమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 40 వేల మైనార్టీ ఓట్లు ఉండడంతో మ్యాగ్జిమమ్..ఈ ఓట్లన్నీ ఒక్క అభ్యర్ధికే పడే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ముస్లింలు ఎవరు ఎవరి పక్షం వహిస్తారో తెలియక ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు.  వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఇద్దరు నేతలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + three =