లోక్ సభ ఎన్నికల హడావుడి ముగిసింది. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక స్థానాలను దక్కించుకొని హైకమాండ్‌కు బహుమతిగా ఇవ్వాలని అనుకున్నారు. చివరికి వచ్చే సరికి 8 స్థానాలతో కాంగ్రెస్ సరిపెట్టుకుంది. మరో 8 స్థానాలను బీజేపీ దక్కించుకోగా.. ఎంఐఎం ఎప్పటిలానే ఒక స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఎన్నికల హడావుడి ముగియడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తిరిగి ఫోకస్ పెట్టాడు. మత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా 12 మందితో మంత్రి వర్గం ఏర్పడింది. మరో ఆరుస్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆరు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకు అటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఇతర పార్టీలలో నుంచి చేరిని వారికి కాకుండా.. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడిన వారికి.. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ సూచించిందట. ఈక్రమంలో ఆగష్టు 15లోగా పూర్తిస్థాయి కేబినెట్‌ను సిద్ధం చేసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా మంది మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఎప్పటి నుంచో పదవి కోసం హైకమాండ్‌తో, రేవంత్ రెడ్డితో కొందరు నేతలు మంతనాలు జరుపుతుండగా.. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తెలిసి మరింత స్పీడ్ పెంచారట. ఆశావాహులంతా రేవంత్ రెడ్డి వద్దకు, హైకమాండ్ వద్దకు క్యూ కడుతున్నారట. అయితే కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనేది రేవంత్ రెడ్డికి పెద్ద టాస్క్‌గా మారింది. ప్రస్తుతం కేబినెట్‌లో నలుగురు రెడ్డి సామాజిక వర్గం నుంచి.. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి ఇద్దరు.. కమ్మ, వెలమ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు కేబినెట్‌లో ఉన్నారు. ఈక్రమంలో ముదిరాజ్, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలను కేబినెట్‌లోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారట. మరి చూడాలి ఎవరికి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కుతుందో..
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ