నల్గొండ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకై రూ.233.82 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt Sanctions Rs 233.82 Cr for Development Works in Nalgonda Municipality, Rs 233.82 Cr for Development Works in Nalgonda Municipality, Development Works in Nalgonda Municipality, Nalgonda Municipality, Development Works, Telangana Govt, Nalgonda Municipality News, Nalgonda Municipality Latest News And Updates, Nalgonda Municipality Live Updates, Mango News, Mango News Telugu,

నల్గొండ జిల్లాలోని నల్గొండ మున్సిపాలిటీలో కొన్ని అభివృద్ధి పనుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.233.82 కోట్లు విడుదల చేసింది. సంక్షేమం మరియు అభివృద్ధి కార్యకలాపాల కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి 2022-23 పథకం కింద నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో పనులకు రూ.233.82 కోట్లు విడుదల చేసినట్టు పేర్కొన్నారు. నల్గొండ మున్సిపాలిటీ సందర్శన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు నిధుల విడుదలకై జిల్లా కలెక్టర్ ప్రభుత్వాన్ని కోరగా, పరిశీలన అనంతరం సంబంధిత అభివృద్ధి పనుల కోసం నిధుల విడుదల చేయడం జరిగిందని తెలిపారు.

రూ.233.82 కోట్లులో ఉదయ సముద్రం, వల్లబ్ రావు చెరువు అభివృద్ధి, ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర, లార్డ్ బాలాజీ దేవాలయాల అభివృద్ధి, నల్గొండ ఐటీ పార్కు నుంచి ఉదయ సముద్రానికి అప్రోచ్‌ రోడ్డు కోసం రూ.139.21 కోట్లు కేటాయించారు. అలాగే నీలగిరి పట్టణంలో కళాభారతి నిర్మాణానికి ప్రభుత్వం రూ.90.61 కోట్లు, హెలీపాడ్‌ నిర్మాణం, తుఫాను నీటి డ్రైన్ కోసం రూ.4 కోట్లను కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 12 =