కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంట్లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు (శనివారం) తెల్లవారుజామున వారి పంటగదిలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సంక్రాంతి పండగని పురస్కరించుకొని పిండివంటలు చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సతీమణి సరోజకు మంటలు అంటుకున్నాయి. ఎమ్మెల్యే భార్య సరోజకు స్వల్పగాయాలు కావడంతో.. వెంటనే బంధువులు ఆమెను హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ