కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ నగరంలో 5 సినిమా థియేటర్లు శాశ్వతంగా మూసివేత?‌

Cinema Theaters Closed Permanently due to Corona Effect, Cinema Theaters in Hyderabad, Cinema Theaters in Hyderabad City, Cinema Theaters in Hyderabad Close Permanently, Corona Effect Five Movie Theaters Have Closed, Five Cinema Theaters in Hyderabad City to Close Permanentl, Five Cinema Theaters Permanently, Impact of the COVID-19 pandemic on cinema, Mango News Telugu

కరోనా మహమ్మారి దేశంలో ప్రతి రంగంపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ మరియు తదనంతర పరిస్థితులు చిత్ర పరిశ్రమ, దాని అనుబంధ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. దేశవ్యాప్తంగా ఏడు నెల‌లు పాటుగా సినిమా థియేట‌ర్స్ మూత‌పడ్డాయి. ఇటీవలే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్ లకు, 50 శాతం సామర్ధ్యంతో సినిమా థియేటర్లు/మల్టిఫ్లెక్సులు తెరిచేందుకు అనుమతి ఇచ్చాయి. అయితే కొంతమేర సినిమా షూటింగ్స్ ప్రారంభమైనప్పటికి, థియేట‌ర్స్ తెరిచేందుకు మాత్రం యాజమాన్యాలు ఇంకా సిద్ధంగా లేవు. 50 శాతం సామర్ధ్యంతో కరోనా నిబంధ‌న‌లు నిమిత్తం ఇంకా ఎక్కువ ఖర్చుతో ప్రస్తుతానికి థియేట‌ర్స్ నడపడం క‌ష్ట‌‌మనే భావనలో యాజ‌మాన్యాలు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో హైదరాబాద్ నగరంలో పలు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు శాశ్వత మూసివేత దిశగా వెళ్తున్నాయి. నగరంలోని టోలిచౌకిలో గల గెలాక్సీ థియేటర్‌, బహదూర్ పుర లోని శ్రీ రామ థియేటర్, మెహదీపట్నంలోని అంబ థియేటర్‌, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీమయూరి థియేటర్‌, నారాయణగూడా చౌరస్తాలోని శాంతి థియేటర్‌ లను ఇకపై శాశ్వతంగా మూసివేయాలని ఆయా యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో నగరంలో ఈ థియేటర్లతో ప్రత్యేక అనుబంధం, అభిమానం కలిగిన ప్రజలు తాజా మూసివేత వార్తతో నిరాశ చెందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ