ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్‌తో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గమాంగ్‌ భేటీ

Former Odisha CM Giridhar Gamang Meets CM KCR at Pragati Bhavan Today, CM Giridhar Gamang Meets CM KCR at Pragati Bhavan Today, Former Odisha CM Giridhar Gamang, EX-CM Giridhar Gamang, Telangana CM KCR, Pragati Bhavan, Senior Parliamentarian Giridhar Gamang, BRS President KCR, Mango News, Mango News Telugu

బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుతో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ పార్లమెంటేరియన్, జాతీయ నేత గిరిధర్ గమాంగ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం ప్రగతి భవన్ లో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో గిరిధర్ గమాంగ్ కుమారుడు శిశిర్ గమాంగ్, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజా జాతీయ రాజకీయ పరిస్థితులు, ఒడిశా రాష్ట్ర రాజకీయాలు గురించి ఇరువురూ నేతలు చర్చించుకున్నట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా బీఆర్‌ఎస్ పేరుతో జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నేతలతో సీఎం కేసీఆర్‌ వరుసగా సమావేశమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌, ఒడిశా మాజీ సీఎం గిరిధర్‌ గమాంగ్‌ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఖమ్మంలో జనవరి 18వ తేదీన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తోలి బహిరంగ సభ నిర్వహించిస్తున్నారు. ఈ సభకు ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, లెఫ్ట్ పార్టీ నేత, కేరళ సీఎం విజయన్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో పాటుగా మరికొందరు కీలక జాతీయ నేతలు హాజరకానున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE