ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కేంద్రం

Parliament Budget Session to Commence on January 31 and Continue Till April 6, Parliament Budget Session to Continue Till April 6, Parliament Budget Session to Commence on January 31, Parliament Budget Session, Parliament Budget Session on January 31, Budget Session 2023, 2023 Parliament Budget Session, Parliament Budget Session News, Parliament Budget Session Latest News And Updates, Parliament Budget Session Live Updates, Mango News, Mango News Telugu

ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యలో ఫిబ్రవరి 14వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు తాత్కాలిక విరామంతో ఏప్రిల్ 6వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఈ సెషన్‌లో 27 సిట్టింగ్‌లు ఉంటాయని, మొత్తం 66 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయని ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ఇక కేంద్ర బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరుగుతాయన్నది తెలిసిందే. ఇక ఈ క్రమంలో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇక బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభలు సవివరమైన చర్చను, ఆ తర్వాత కేంద్ర బడ్జెట్‌పై చర్చను నిర్వహిస్తాయి.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనుండగా, కేంద్ర బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారు. కాగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో లోక్‌సభ మరియు రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంతో సెషన్ ప్రారంభమవుతుంది. గత ఏడాది ఆగస్టులో రాష్ట్రపతిగా బాధ్యతలు అందుకున్న తర్వాత రాష్ట్రపతి ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి. ఇక డిపార్ట్‌మెంట్ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు గ్రాంట్‌ల డిమాండ్‌లను పరిశీలించడానికి మరియు తమ మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలకు సంబంధించిన నివేదికలను రూపొందించడానికి ఫిబ్రవరి 14 నుండి మార్చి 12 వరకు విరామం ఉంటుంది. ఈ విరామ సమయంలో ఆయా మంత్రిత్వ శాఖలు సమర్పించిన గ్రాంట్లపై సమగ్ర అధ్యయనం జరుగుతుంది. అలాగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గ్రాంట్ల కోసం వచ్చిన డిమాండ్లు, ఇతర నివేదికలను పరిశీలిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 3 =