సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు ప్రజలు.. 65వ జాతీయ రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు

Sankranti Festival Rush Major Traffic Snarl At Panthangi Toll Plaza On National Highway No 65, National Highway No 65, Sankranti Festival Rush Major Traffic Snarl At Panthangi Toll Plaza, Major Traffic Snarl At Panthangi Toll Plaza, Sankranti Festival Rush, Panthangi Toll Plaza, Dasara Festival Rush At Panthangi Toll Plaza, Mango News, Mango News Telugu

మకర సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ముఖ్యంగా నగరంలో ఉండే ఆంధ్రప్రదేశ్ వాసులు సంక్రాంతి పండుగకు తమ స్వస్థలాలకు వెళ్తుండటం సర్వ సాధారణంగా జరిగే విషయమన్న సంగతి తెలిసిందే. అలాగే పండుగకు ఒకరోజు ముందే తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, ఉద్యోగులు తమ సొంత వాహనాలలో బయలుదేరడంతో రాష్ట్రంలోని ప్రధాన రహదారులు కిక్కిరిసిపోతున్నాయి. చౌటుప్పల్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పరిధిలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రధానంగా పంతంగి టోల్‌ప్లాజా వద్ద కి.మీ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో టోల్‌ప్లాజా నిర్వాహకులు మొత్తం 16 టోల్ గేట్లలో విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు 10 గేట్ల నుంచి పంపిస్తుండగా.. హైదరాబాద్ వైపు వచ్చే వాహనాలకు మరో ఆరు గేట్లను కేటాయించారు. ఒకే సమయంలో వేలాదిగా వాహనాలు తరలిరావడంతో ప్రయాణికులు టోల్‌ప్లాజా వద్ద దాదాపు అర కిలోమీటర్ పైగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫాస్టాగ్‌ ఉన్నప్పటికీ వాహనాలు భారీగా ఉండటంతో ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో టోల్‌ ప్లాజాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో మూడు సెకండ్లు ఉన్న ఫాస్టాగ్‌ సెన్సర్‌ను ప్రస్తుతం రెండు సెకండ్లకు కుదించారు. దీంతో నిమిషానికి 20 వాహనాలు టోల్‌ ప్లాజా నుంచి బయటకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో రాచకొండ పోలీసులు మరియు టోల్‌ప్లాజా సిబ్బంది వాహనాల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + two =