తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్ఎస్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని విధంగా బీఆర్ఎస్ చితకలపడిపోయింది. ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేక పోయింది. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్‌కు గట్టి షాక్‌లు ఇస్తున్నారు. ఒక్కొక్కరుగా అధికార కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారు. అసెంబ్లీలో తమ బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. బీఆర్ఎస్‌లోని కీలక నేతలకు వల వేసి తమ వైపు తిప్పుకుంటోంది. ఒకరంగా బీఆర్ఎస్‌ను ఖాళీ చేయడమే లక్ష్యమన్నట్లుగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే అయిదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరగా.. మరో ఎమ్మెల్యే హస్తం పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.
అవును.. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. గద్వా జెడ్పీ చైర్‌పర్సన్ సరితకు ఎమ్మెల్యేకు మధ్య కొద్దిరోజులుగా విబేధాలు కొనసాగుతున్నాయి. అవి తారా స్థాయికి చేరడంతో కృష్ణ మోహన్ రెడ్డి పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో ఆయన మంతనాలు జరుపుతున్నారట. మంత్రి జూపల్లి కృష్ణారావుతో పలుమార్లు హైదరాబాద్‌లో భేటీ అయ్యారట. కాంగ్రెస్‌లో చేరడంపై చర్చించారట. అటు కాంగ్రెస్ కూడా కృష్ణ మోహన్ రెడ్డి తమ పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరనున్నారట. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయింది.
దీనిపై ఇటీవల కృష్ణ మోహన్ రెడ్డి స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి పార్టీ మార్పుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేని.. కార్యకర్తల అభిప్రాయం తెలుసుకున్నాకే తుది నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.మ మండలాల వారీగా అభిప్రాయాలు సేకరిస్తున్నానని అన్నారు. పార్టీ మారాలని తన అనుచరుల నుంచి ఒత్తిడి పెరిగుతోందని పేర్కొన్నారు. ఏది ఏమయినా నియోజకవర్గ ప్రయోజనాల కోసమే పార్టీ మార్పు ఆలోచన అని కృష్ణ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని వివరించారు.
ఇకపోతే కృష్ణమోహన్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. 2009లో టీడీపీ తరుపున గద్వాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులకు బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) పార్టీలోకి జంప్ అయ్యారు. మరోసారి బీఆర్ఎస్ తరుపున 2014 సార్వత్రిక ఎన్నికల్లో గద్వాల్ నుంచి పోటీ చేసి మళ్లీ డీకే అరుణ చేతిలోనే రెండోసారి ఓడపోయారు. ఆ తర్వాత 2017లో బీఆర్ఎస్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ తరుపున గద్వాల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణను ఓడించారు. ఈసారి 51,687 ఓట్ల మెజార్టీతో గెలుపొదారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కృష్ణ మోహన్ రెడ్డి గెలుపొందారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE