ఆస్ట్రేలియా పార్లమెంట్ హౌస్‌లో ‘బతుకమ్మ’ వేడుకలు.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం

TRS MLC Kavitha Invited For Bathukamma Celebrations in Australia Parliament House on Sep 25th, Bathukamma Celebrations in Australia Parliament, Bathukamma Celebrations , TRS MLC Kavitha Invited, Bathukamma Celebrations, TRS MLC Kavitha , Mango News, Mango News Telugu, Telangana Bathukamma, Bathukamma 2022, Kavitha Invited To Bathukamma Celebrations, Australia Parliament House Bathukamma , Bathukamma Latest News And Updates, TRS MLC Kavitha News And Live Updates

తెలంగాణ పండగ ‘బతుకమ్మ’ రాష్ట్రంతో పాటు దేశం ఎల్లలను కూడా దాటేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఏసీటీ (ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ) కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియా పార్లమెంట్‌ హౌస్‌లో సాంప్రదాయ బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆస్ట్రేలియా పార్లమెంట్‌ హౌస్‌ నుంచి ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆమెను ఆహ్వానించింది. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ కవిత కార్యాలయం స్వయంగా ట్విట్టర్‌లో తెలియజేసింది. ‘ఆస్ట్రేలియన్ పార్లమెంట్‌లో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ మాజీ ఎంపీకి ఆహ్వానం అందింది. తెలంగాణలోని ప్రముఖ బతుకమ్మ వేడుకలకు ఆస్ట్రేలియా పార్లమెంట్ సాక్షిగా సిద్ధమైంది. ఫెడరల్ మరియు ఏసీటీ మంత్రులు మరియు ఆస్ట్రేలియా అంతటా పాల్గొనేవారిని స్వాగతించడానికి ఈ వేడుకను ఏర్పాటు చేశారు’ అని పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =