గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ దాఖలు పక్రియ కొనసాగుతుంది. తొలిరోజు 17 మంది అభ్యర్థులు మొత్తం 20 నామినేషన్లు దాఖలు చేయగా, రెండోరోజైన గురువారం నాడు అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్స్ దాఖలు చేశారు. రెండో రోజు మొత్తం 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించినట్టు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 539 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లయింది. రెండోరోజు నామినేషన్స్ దాఖలు చేసిన వారిలో టిఆర్ఎస్ నుంచి 195 , బీజేపీ 140, ఇండిపెండెంట్ అభ్యర్థులు 110, కాంగ్రెస్ 68, టీడీపీ 47, ఎంఐఎం 27, గుర్తింపు పొందిన ఇతర రాజకీయ పార్టీలు 16, సీపీఎం 4, సిపిఐ ఒకటి ఉన్నాయి. మరోవైపు రేపే నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో రేపు కూడా భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ