ఆ రెండు జిల్లాల పేరు మార్పునకై ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Mango News, New names for Warangal Districts, New names for Warangal notified, Notification issued for reorganisation of Warangal districts, Preliminary Notification for Warangal Urban Warangal Rural Districts, Preliminary Notification for Warangal Urban Warangal Rural Districts Name Change, Telangana Govt, Telangana Govt Issued Preliminary Notification for Warangal Urban, Telangana issues notification to rename Warangal districts, Warangal Rural Districts Name Change, Warangal Urban Rural districts to be renamed

వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా పేరును హ‌న్మ‌కొండ జిల్లాగా, అలాగే వరంగల్‌ రూరల్ జిల్లా పేరును వరంగల్ జిల్లాగా మార్చబోతున్నట్టు ఇటీవల వరంగల్ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లాలను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా పేర్లు మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి 30 రోజుల్లోగా ఈ మార్పులపై తమ అభ్యంతరాలు, ఇతర సూచనలను ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రజలు అందించవచ్చని పేర్కొన్నారు.

ఇక హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతో కలిపి హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయబోతున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. హన్మకొండ, వేలేరు, పరకాల, ధర్మసాగర్‌, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, నడికుల, దామెర, కాజీపేట, ఐనవోలు, కమలాపూర్‌, భీమదేవరపల్లి ఇలా మొత్తం 12 మండలాలు హన్మకొండ జిల్లా పరిధిలోకి రానున్నాయి. అలాగే వరంగల్, నర్సంపేట్ రెవెన్యూ డివిజన్లతో కలిపి వరంగల్ జిల్లా ఏర్పాటు చేయబోతున్నారు. వరంగల్‌, ఖిలావరంగల్‌, గీసుకొండ, ఆత్మకూరు, శాయంపేట, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్‌, నెక్కొండ వంటి 15 మండలాలు వరంగల్ జిల్లా పరిధిలోకి రానున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + eight =