జీహెచ్‌ఎంసీ ఎన్నికలు: తొలిరోజు 20 నామినేషన్స్ దాఖలు

GHMC Elections- First Day 20 Nominations Filed

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్ పక్రియ మొదలైన సంగతి తెలిసిందే. కాగా తొలిరోజు 17 మంది అభ్యర్థులు మొత్తం 20 నామినేషన్లు దాఖలు చేసినట్టుగా వెల్లడించారు. దాఖలైన నామినేషన్స్ లో టిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 6, టీడీపీ నుంచి 5, కాంగ్రెస్‌ నుంచి 3, బీజేపీ నుంచి 2, ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి 3, గుర్తింపు పొందిన మరో పార్టీ నుంచి ఒకటి వచ్చినట్టుగా పేర్కొన్నారు. నామినేషన్ పక్రియ నవంబర్ 20, శుక్రవారంతో ముగియనుడడంతో గురువారం, శుక్రవారం పెద్దసంఖ్యలో నామినేషన్స్ దాఖలయ్యే అవకాశం ఉంది. ఇక నవంబర్ 21న నామినేషన్లు పరిశీలన జరుపనున్నారు. నవంబర్ 22 ను నామినేషన్స్ ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. డిసెంబర్ 1 న పోలింగ్ నిర్వహించి, డిసెంబర్ 4 న ఫలితాలను వెల్లడించనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ