
మారుతున్న కల్చర్ కు అనుగుణంగా తనను తాను మార్చుకోవడంలో హైదరాబాద్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇప్పుడు అదే విషయాన్ని కో లివింగ్ పీజీలతో మరోసారి ప్రూవ్ చేసింది. భిన్న సంస్కృతులను, భిన్న మతాలను ఆదరిస్తూ.. అందరినీ అక్కున చేర్చుకునే హైదరాబాద్ నయా కల్చర్ ను అక్కున చేర్చుకోవడంలోనూ అదే పద్ధతిని ఫాలో అవుతుంది. అందుకే అప్పుడెప్పుడో అమెరికా లాంటి దేశాల్లో.. ఈ మధ్య పుణే, బెంగళూరు, ముంబయ్,ఢిల్లీ వంటి పోష్ సిటీల్లో కనిపించే ట్రెండ్ ను ఇప్పుడు తానూ సొంతం చేసేసుకుంటోంది. అందుకే ఇప్పుడు సిటీ మొత్తంలో 50 నుంచి 80 వరకూ కో లివింగ్ కేంద్రాలకు హైదరాబాద్ కేరాఫ్ గా మారింది.
కరోనా తర్వాత ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్క్ ఇన్ ఆఫీస్‌కి అలవాటు అయిపోయారు. దీంతో మొన్నటి వరకూ బోడి అయిపోయిన పీజీలు,హాస్టల్స్ ఇప్పుడు మళ్లీ కళకళలాడుతున్నాయి. అయితే వీటన్నిటికి కాస్త భిన్నంగా కో లివింగ్ పీజీలు రావడం.. యూత్ కు కొత్త అనుభూతినిస్తోంది. ఒక్కో లివింగ్ సెంటర్లో దాదాపు 300 మంది ఉండటానికి వీలుండే ఈ సెంటర్స్ కు చాలామంది యూత్ క్యూ కడుతున్నారు. ఐటీ రంగం అభివృద్ధితో పాటు.. కో లివింగ్ బిజినెస్ బాగా పెరగడంతో చాలామంది ఇప్పుడు బోయ్స్ , గాళ్స్ అన్న తేడా లేకుండా ఇద్దరూ ఒకే కాంపౌండ్ లో ఉండే కో లివింగ్ సెంటర్ ను పెడదామా అన్న ఆలోచనలో ఉంటున్నారు. పీజీలకు , హాస్టల్స్ లో అమ్మాయిలు చేరాలన్నా.. అబ్బాయిలు చేరాలన్నసవాలక్ష కండిషన్లు ఉంటాయి.
ఈ టైమ్ కు రావాలి. అబ్బాయిలతో గేటు ముందు బాతాఖానీలు పెట్టకూడదు.. రాత్రి పదయితే గేటుకు తాళం వేస్తాం.. కరెంట్ ఎక్కువ వాడకూడదు.. నీళ్లు వేస్ట్ చేయొద్దు , వంటి కండిషన్స్ చాలానే ఉంటాయి. అయితే ఇవన్నీ అమ్మాయిల భద్రత కోసమే కాబట్టి పేరెంట్స్ ఇలాంటివి అయితే తమ పిల్లలకు బెటర్ అన్న ఆలోచనలో ఉన్నారు. అయితే మారుతున్న జనరేషన్ కు ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి పద్ధతులుగానే కనిపిస్తాయి. అందుకే ఇప్పుడు వచ్చిన కో లివింగ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో అంటూ నెట్టింట్లో వెతుకులాటలు మొదలు పెట్టేసారు. అబ్బాయిలతో మాట్లాడటమే తప్పు అన్న పీజీ యాజమాన్యాలు .. ఇప్పుడు అబ్బాయిలు,అమ్మాయిలు ఒకే క్యాంపస్ లో ఉండటానికి ఆసక్తి చూపడంతో ఇదేదో బాగుందే అంటున్నారు యూత్ .
ఇంకొక విషయం ఏంటంటే.. పీజీలలో సాధారణంగా సింగిల్ బెడ్ రూమ్ అద్దెకు తీసుకోవాలంటే కనీసం 15 వేల నుంచి 18 వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ కో లివింగ్‌లో షేరింగ్ లో రూ.7 వేల ఖర్చుతో అంతకంటే ఎక్కువ సౌకర్యాలను పొందొచ్చు. అందుకే ఇప్పుడు ఈ కో లివింగ్ సెంటర్లపై యూత్ క్రేజ్ పెంచుకోవడానికి మరొకర కారణంగా మారింది. మనకు నచ్చినన్ని రోజులు ఉండొచ్చు, లేదంటే వేరే చోటుకు వెళ్లొచ్చు.
అయితే బెంగళూరు, హైదరాబాద్, పుణెలో,కలకత్తా, ముంబై వంటి నగరాలు నిర్వహిస్తున్న కో లివింగ్ సెంటర్ల లిస్టులోకి.. ఈ ఏడాదే ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ కొద్ది రోజుల్లోనే నెంబర్ వన్ ప్లేసుకు వెళ్లిపోయినా ఆశ్చర్యపోనక్కరలేదంటున్నారు పీజీ యజమానులు. పెరుగుతోన్న డిమాండ్ తో హైదరాబాద్ లో మరో వెయ్యి పడకలతో కో లివింగ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. బంజారాహిల్స్,మణికొండ , మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ఐటీ హబ్‌ల చుట్టూ ఈ కో లివింగ్ కేంద్రాలు ఉన్నాయి. కొవిడ్ వల్ల నార్మల్ పీజీలకే డిమాండ్ తగ్గిపోయిందనుకున్న రోజుల నుంచి.. ఇప్పుడు పరిస్థితులు మారడంతో కో లివింగ్ పీజీలుగా రూపు మార్చుకుని మరీ తమ తడాఖా చూపిస్తున్నాయి.
ఈ కో లివింగ్ కేంద్రంలో ఆగ, మగ ఇలా ఎవరైనా వారికీ నచ్చినట్టు ఉంటారు. ఎవరిపని వారిదే. అయితే యంగ్ టెకీలు మాత్రం హాస్టళ్లు, అద్దెగదుల కోసం వెతకడం మానేసి.. కో లివింగ్ రూమ్స్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. కో-లివింగ్ అనేది రెసిడెన్షియల్ కమ్యూనిటీ లివింగ్ మోడల్ లా ఉంటాయి కాబట్టి వీటికి యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అంటే ఒకే రకం అభిరుచి, అలవాట్లు ఉన్న వ్యక్తులు రూమ్ ను షేర్ చేసుకుంటారు. దీంతో కో-లివింగ్ స్పేస్ ల కోసం డిమాండ్ పెరుగుతోంది. బెంగళూరుకు చెందిన ఓ సంస్థ హైదరాబాద్ లో300 పడకలతో కూడిన కో-లివింగ్ స్పేస్ లను నిర్వహిస్తోంది. నెలకు ఒక్కోబెడ్ కు 10 వేల నుంచీ 15వేల వరకు వసూలు చేస్తోంది. కో-లివింగ్ ఇన్ ఇండియా లో 2021 చివరి నాటికి 2.1 లక్షల కో-లివింగ్ స్పేస్ లు ఉంటే 2025కు అది 5.5 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
సహజీవనం చేసేవారు, మ్యారేజ్ ఫిక్స్ అయినవారు. ప్రేమించుకుని పెళ్లిచేసుకునే జంటలు ఇద్దరు ఉద్యోగులుకావడంతో ఇటువంటి రూమ్స్ కు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంతే కాదు నిర్వాహకులు మంచి మంచి వసతులను కూడా ఏర్పాటు చేస్తుండడంతో ఎక్కువగా వీటికి ఎక్కువగా డిమాండ్ పెరుగుతుంది. ఈ కో లివింగ్స్ రూమ్స్ ఐటీ పరిసరప్రాంతాల్లో ఉండడంతో ఉద్యోగులకు కూడా ఎక్కువ ప్రయాణించే సమయం తగ్గుతుంది. అలాగే ట్రాఫిక్ సమస్య ఉండదు. ఐదు,పదినిమిషాల్లో నేరుగా ఆఫీస్ కు వెళ్లే సదుపాయం ఉండడంతో ఎక్కువగా ఈ పీజీలకే ఓటేస్తున్నారు.అయితే ఈ కల్చర్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన మరికొందరికలో కనిపిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY