ఢిల్లీలో సీబీఐ విచారణకు హాజరైన తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మరియు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఈ మేరకు వారు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం విచారణకు హాజరయ్యారు. నకిలీ సీబీఐ అధికారిగా చెలామణీ అవుతున్న శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడిని విచారించే క్రమంలో ఇటీవల తెలంగణలో గ్రానైట్ వ్యాపారాలపై దర్యాప్తు సంస్థలు దాడులు చేసిన నేపథ్యంలో.. కేసుల నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీనివాస్ తనకున్న పరిచయాలను ఉపయోగించుకున్నట్లు గుర్తించారు. దీంతో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు అతనితో సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించిన సీబీఐ అధికారులు వీరికి బుధవారం నోటీసులు అందజేశారు. ఈరోజు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు.

ఈ నేపథ్యంలో మంత్రి గంగుల కమలాకర్ మరియు ఎంపీ వద్దిరాజు రవిచంద్రలు నేడు ఢిల్లీలోని సీబీఐ కార్యాలయం ఎదుట హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్నవారితో ఎంతోమందితో పరిచయాలు అవుతుంటాయని, అలాగే వారిలో కొందరు తమతో ఫోటోలు దిగితుంటారని తెలిపారు. ఇటీవల ఖమ్మంలో కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో శ్రీనివాస్ తనతో ఫోటో దిగగాడని, అంటే తప్ప అతనితో వ్యక్తిగత పరిచయం లేదని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఇక సీబీఐ అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తామని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 12 =