కరోనాపై పోరు: సీఎం రిలీఫ్ ఫండ్‌ కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.1.55 కోట్లు విరాళం

HDFC Bank Donated Rs 1.55 Cr to Telangana CM Relief Fund to Assist State Govt in Fighting Covid-19

కరోనా వైరస్‌ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా పలు సంస్థలు విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనాపై పోరుకు మద్దతుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌ కు రూ.1.55 కోట్లను విరాళంగా ప్రకటించింది. మంగళవారం నాడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ భ‌టియా, తెలంగాణ స్టేట్ హెడ్ శ్ర‌వ‌ణ్ కుమార్ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ను కలిసి ఈ విరాళానికి సంబంధించిన చెక్కులను అంద‌జేశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ