తెలంగాణ అభివృద్ధి కోసం శ్రమించే ప్రతి ఒక్కరూ మా బిడ్డలే, ఏపీలో ఓటు వదులుకుని ఇక్కడ తీసుకోండి – మంత్రి హరీశ్‌ రావు

Minister Harish Rao Sensational Comments on The Present Situations in AP,Minister Harish Rao Sensational Comments,Harish Rao Comments on The Present Situations,Present Situations in AP,Mango News,Mango News Telugu,Minister Harish Rao,Minister Harish Rao Makes Sensational Comments,Minister Harish Rao Latest News and Updates,Minister Harish Rao Live News,Minister Harish Rao News Today,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Andhra Pradesh Politics,Minister Harish Rao Sensational Comments News Today

ఏపీలో ఓటు వదులుకుని తెలంగాణలో తీసుకోండి అని ఇక్కడ స్థిరపడిన కార్మికులకు మంత్రి హరీశ్‌ రావు సూచించారు. మంగళవారం ఆయన సంగారెడ్డిలో మేస్త్రీ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు కార్మికులను ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఉంటున్న కార్మికులకు ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితులకు, తెలంగాణలోని పరిస్థితులకు తేడా తెలుసని.. తెలంగాణకు ఏపీ ఏ విధంగానూ పోటీయే కాదని స్పష్టం చేశారు. అక్కడికీ.. ఇక్కడికీ భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా (జమీన్‌ ఆస్మాన్‌ ఫరక్‌) ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కార్మికుల కోసం పాటుపడుతోందని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వచ్చే నెల ఒకటో తేదీన ‘మే డే’ సందర్భంగా సీఎం కేసీఆర్‌, కార్మికులకు శుభవార్త వినిపిస్తారని తెలిపారు.

కాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రూ.2 కోట్ల వ్యయంతో కార్మిక భవనాలను నిర్మిస్తామని, మేడే రోజున వీటికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు మంత్రి హరీశ్ రావు. ప్రతి ఒక్కరూ ప్రయోజనాలు పొందేందుకు వీలుగా భవన నిర్మాణ కార్మిక మండలిలో సభ్యత్వం తీసుకోవాలని ఆయన కార్మికులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితిపై అక్కడున్న వాళ్లను అడగాలని, అలాగే ఇక్కడున్నవారు కూడా అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటారు కదా.. అక్కడికీ, ఇక్కడికీ తేడా చూడాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని, అందుకే వారు ఏపీలో ఓటు హక్కు వదులుకుని తెలంగాణలోనే పెట్టుకోండి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా తెలంగాణలో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏపీ ఓటర్లను ఆకర్షించడానికి బీఆర్ఎస్ నాయకులు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + one =