హిందుస్థాన్ కోకాకోలా బేవరేజస్ సంస్థ (హెచ్‌సీసీబీ) తెలంగాణ రాష్ట్రంలో రెండవ ప్లాంట్ ను ప్రారంభించనుంది. రూ.1000 కోట్ల పెట్టుబడితో సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌లో తమ రెండవ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్టు హెచ్‌సీసీబీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో హెచ్‌సీసీబీ ఛైర్మన్ అండ్ సీఈఓ నీరజ్ గార్గ్ ప్రకటన చేశారు. అలాగే హెచ్‌సీసీబీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య నాలుగు అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో హెచ్‌సీసీబీ అత్యాధునిక కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందని అన్నారు. సాలిడ్ వేస్ట్, వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్ మరియు స్కిల్ బిల్డింగ్ రంగాలలో సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కూడా కుదుర్చుకుందని, అలాగే టెక్ ఆర్ అండ్ డి సెంటర్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారిని కోరినట్టు తెలిపారు. రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో హెచ్‌సీసీబీ ఉనికిని తెలంగాణ విలువైనదిగా పరిగణిస్తుందన్నారు. ఆ సంస్థ 25వ వార్షికోత్సవం సందర్భంగా రెండవ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా మరియు ఒప్పందం కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా రాష్ట్రం పట్ల హెచ్‌సీసీబీ యొక్క నిబద్ధత మరింతగా పెరుగుతుందన్నారు. 25 ఏళ్ల మైలురాయిని సాధించిన హెచ్‌సీసీబీ సంస్థకు, ఉద్యోగులు మరియు సంస్థ భాగస్వాములకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ