ఆర్ధిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు భారత్ సాయం.. పెద్దన్న పాత్ర పోషిస్తోందని ప్రశంసించిన మాజీ క్రికెటర్ జయసూర్య

Sri Lanka Veteran Cricketer Jayasuriya Thanked India for Helping his Country During the Crisis, Sri Lanka Economy, Sri Lanka Veteran Cricketer Jayasuriya Thanked India for Helping his Country, Sri Lanka Veteran Cricketer Jayasuriya, Sri Lanka Veteran Cricketer, Sri Lanka Cricketer, Veteran Cricketer Jayasuriya, Sri Lanka Crisis, Sri Lankan cricketer Sanath Jayasuriya, Former veteran cricketer Sanath Jayasuriya thanked PM Modi for helping Sri Lanka During the Crisis, Sri Lankan batting legend Sanath Jayasurya, Sri Lanka Economic Crisis, Sri Lanka Economic Crisis Latest News, Sri Lanka Economic Crisis Latest Updates, Narendra Modi, Prime Minister of India, Narendra Modi Prime Minister of India, PM Narendra Modi, Prime Minister Narendra Modi, Mango News, Mango News Telugu, #SanathJayasurya, #BigBrotherIndia, #BigBrother, #SriLankaEconomicCrisis,

స్వాతంత్ర్యం తర్వాత అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న శ్రీలంకకు సహాయం పంపినందుకు భారత ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య. ఈ క్రమంలో భారతదేశాన్ని జయసూర్య “పెద్దన్న” అని సంబోధించారు. “పొరుగు దేశంగా మరియు మన దేశానికి పెద్దన్న లాంటి భారతదేశం ఎల్లప్పుడూ మాకు సహాయానికి ముందుకొస్తోంది. అందుకు మేము భారత ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రస్తుత పరిస్థితులలో మాకు మనుగడ అంత సులభం కాదు. అయితే కొద్దీ రోజుల్లోనే మేము ఈ సంక్షోభం నుండి బయటకు వస్తామని ఆశిస్తున్నాము. అయితే దీనికి సమయం పట్టొచ్చు. అది కూడా భారతదేశం మరియు ఇతర దేశాల సహాయంతో” అని జయసూర్య పేర్కొన్నాడు.

మరోవైపు తీవ్రమైన విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్న శ్రీలంకలో విద్యుత్ సంక్షోభాన్ని తగ్గించడంలో సహాయపడటానికి భారతదేశం ఇప్పటివరకు శ్రీలంకకు 2,70,000 MT ఇంధనాన్ని సరఫరా చేసింది. గత 24 గంటల వ్యవధిలో 36,000 MT పెట్రోల్ మరియు 40,000 MT డీజిల్ ఒక్కొక్కటి శ్రీలంకకు డెలివరీ చేయబడింది. ఇప్పటివరకు భారత్ సహాయం కింద వివిధ రకాల ఇంధనాల మొత్తం సరఫరా 2,70,000 MT కంటే ఎక్కువగా ఉంది అని కొలంబోలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. మునిగిపోతున్న ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయం చేయడానికి శ్రీలంకకు భారతదేశం మరో $1 బిలియన్‌ను క్రెడిట్‌గా ప్రకటించింది. కొలంబోకు $1 బిలియన్ క్రెడిట్ లైన్ వారి ఆహార ధరలు మరియు ఇంధన ఖర్చులను అదుపులో ఉంచడంలో సహాయపడుతుందని తెలిపింది.

అయితే ఆహారం మరియు ఇంధన కొరతతో శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతోంది. శ్రీలంక దేశంలో కోవిడ్-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఆర్థిక వ్యవస్థ పతనంలో కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే శ్రీలంక రూపాయి వేగంగా క్షీణిస్తోంది మరియు విదేశీ రుణాలు పెరుగుతున్నాయి. గ్యాస్ మరియు ఇంధన కొరతకు దారితీసిన పర్యాటకం తగ్గుదల కారణంగా శ్రీలంక ప్రభుత్వ ఆదాయం కూడా పెద్ద దెబ్బతింది. దీంతో దేశంలో భారీ విద్యుత్ కోతలకు దారితీసింది. ఇంకోవైపు నగరంలో జరుగుతున్న సామూహిక నిరసనల కారణంగా కొలంబోలో ఉన్న అనేక హోటళ్లు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత నెమ్మదిగా పుంజుకుంటున్న శ్రీలంక యొక్క పర్యాటక రంగం ఇప్పుడు తీవ్రంగా దెబ్బతింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 7 =