గాంధీ ఆసుపత్రి ఘటన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి, హోం మంత్రి ఆదేశాలు

Gandhi hosp rape case, Gandhi Hospital Incident, Gandhi Hospital launches probe into alleged rape of two women, Gandhi Hospital Rape case, Home Minister Mahmood Ali, Home Minister Mahmood Ali Held Meeting with Police Officials on Gandhi Hospital Incident, Home Minister Mahmood Ali Meeting with Police Officials on Gandhi Hospital Incident, Hyderabad hospital rape case, Mango News, Telangana Home Minister, Telangana Home Minister Mahmood Ali, TS Home Minister Mahmood Ali

గాంధీ ఆసుపత్రి సంఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస గౌడ్ లు సంబంధిత అధికారులతో మంగళవారం నాడు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైదారాబాద్ లోని హోం మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పోలీసు కమీషనర్ అంజనీ కుమార్, అడిషనల్ కమీషనర్ శీఖా గోయల్, డిసిపి కల్మేశ్వర్, గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావు, తదితర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఈ సంఘటన పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గదర్శకాలతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని మంత్రులు అన్నారు. ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేయాలని, వేగంగా పరిష్కరించాలని, చట్ట పరంగా పకడ్బందిగా చర్యలు చేపట్టాలని మంత్రులు పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలో పట్టుకుంటామని పోలీసు కమీషనర్ ఈ సందర్భంగా తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ