
మనం రోజూ చూసే లక్షలాది వాహనాలకు వెనుకా ముందు కూడా రకరకాల నంబర్ ప్లేట్లు కనిపిస్తుంటాయి. ఒకదానికి తెలుపు, ఇంకోదానికి పసుపు, మరోదానికి ఆకుపచ్చ రంగుతో బోర్డులు కనిపించగా.. చాలా అరుదుగా నలుపు, ఎరుపు, నీలం రంగుల బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలా ఒక్కో బోర్డు ఒక్కో ప్రత్యేక రంగులో నంబర్ ప్లేటు ఎందుకు ఏర్పాటు చేస్తారో చాలామందికి కారణాలు తెలియవు.
ఏ కలర్ నంబర్ ప్లేటు దేనికి సంకేతం? ఎవరెవరు దీనిని వినియోగిస్తారనేది చాలా కొద్ది మందికే తెలుస్తుంది. అయితే కొంతమంది తెలియక నాన్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను రెంట్‌కు ఇచ్చి ఆర్టీఏ అధికారులకు అడ్డంగా బుక్కవుతుండటం చూస్తూనే ఉంటాం. అయితే ఏ వాహనం దేనికో అన్నది.. మనం వాహన రిజిస్ట్రేషన్ సమయంలో అవి అందించబోయే సర్వీసులను సూచించేలా ఆయా రంగుల్లో నంబర్‌ప్లేట్లను కేటాయిస్తారు. అలా భారత దేశంలో ఏడు రకాల నంబర్ ప్లేట్లు ఉంటాయి.తెలుపు రంగు ప్లేటుపై నంబర్
నాన్ ట్రాన్స్‌పోర్ట్‌కు వెహికలర్‌కు గుర్తుగా తెలుపు రంగు ప్లేటుపై నలుపు రంగు నంబర్ ఉంటుంది. అలా ఉంటే అది నాన్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్ అని సూచిస్తుంది. ఇవే ఎక్కువగా రోడ్లు మీద కనిపిస్తూ ఉంటాయి. దీనిని ఎక్కువ మంది సొంత అవసరాలకు వాడుకునే వాహనాలకు కేటాయిస్తారు. ఇలాంటి నంబర్ ప్లేట్ ఉన్న వెహికల్స్‌ను రెంటుకు ఇవ్వకూడదు. ఒకవేళ ఇలాంటి వాహనాలను ఎవరైనా అద్దెకు నడుపుతూ పట్టుబడితే ఆర్టీఏ అధికారులు ఆ వెహికల్ ను సీజ్ చేస్తారు.
పసుపు రంగుపై నలుపు నంబర్వాహనం వెనుక పసుపు రంగు ప్లేట్‌పై నలుపు రంగులో నంబర్ ఉంటే .. ఆ వెహికల్ ట్రాన్స్‌పోర్ట్ వాహనమని అర్ధం. ఇలాంటి వాహనాలను కమర్షియల్ అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తారు. అంటే పసుపు రంగు ప్లేట్‌పై నలుపు రంగులో నంబర్ ఉంటే గూడ్స్ సర్వీస్‌కు అనుమతి ఉన్న వాహనాలను సూచిస్తుంది..
పసుపు రంగుపై ఎరుపు నంబర్‌అలాగే పసుపు రంగు ప్లేట్‌పై నలుపు రంగులో కాకుండా ఎరుపు రంగులో నంబర్ ఉంటే ఆ వాహనానికి ట్రేడ్ సర్టిఫికెట్ ఉందని అర్థం. అంటే విక్రయించే కొత్త వెహికల్స్‌ను తరలించేవాటికి ఇలాంటి నంబర్ ప్లేట్స్‌ను కేటాయిస్తుంటారు.
నలుపు రంగు ప్లేట్‌పై నంబర్‌అద్దె సర్వీస్‌కు అనుమతించిన వెహికల్స్‌కు బ్లాక్ కలర్ ప్లేట్‌పై పసుపు రంగు నంబర్ ఉంటుంది. వీటిని అద్దెకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాహనాలతోనే చాలా మంది రెంటల్ సర్వీస్‌ను అందిస్తుంటారు. ఇలాంటి వెహికల్స్ కాకుండా ఇతర వాహనాలను కిరాయికిస్తే మాత్రం ఆర్టీఏ అధికారులు సీజ్ చేస్తారు.
బ్లూ ప్లేట్‌పై నంబర్ఫారెన్ ఎంబెసీస్ వాహనాలకు మాత్రం బ్లూ కలర్ నంబర్ ప్లేటు ఉంటుంది. విదేశీ ప్రతినిధులు ఎవరైనా వస్తే ఈ బ్లూ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాల్లోనే ప్రయాణిస్తారు. అంటే విదేశీ అంబాసిడర్లు, దౌత్యవేత్తల వాహనాలకు ఈ రకం నంబర్ ప్లేట్లు ఉంటాయి.ఆకుపచ్చ రంగు ప్లేట్‌పై నంబర్దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆకుపచ్చ నంబర్ ప్లేట్లు కేటాయించారు. ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లకు ఆకుపచ్చ రంగు నంబర్ ప్లేట్‌పై తెలుపు రంగులో నంబర్లు ఉంటాయి. అలాగే వాణిజ్య ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు ఆకుపచ్చ రంగు ప్లేటుపై పసుపు రంగులో నంబర్లు ఉంటాయి.
ఎరుపు రంగు మీద నంబర్ లేని ప్లేట్గవర్నర్, రాష్ట్రపతి వాహనాలకు రెడ్ కలర్ ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్‌లో మరో విశేషం ఉంటుంది. ఈ ప్లేట్ మీద జాతీయ చిహ్నం అశోక స్తంభం నమూనా ఉంటాయి తప్ప ఎలాంటి నంబర్లు ఉండవు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY