హైదరాబాద్ మెట్రో రైల్ రికార్డు సృష్టించింది. రికార్డు స్థాయిలో నిన్న ఒక్కరోజే మెట్రోలో 4 లక్షల మంది ప్రయాణించారు. కాగా హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ మెట్రో రైల్ సాధారణ పనివేళలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గణేష్ నిమజ్జన ఊరేగింపు జరగనున్న దృష్ట్యా ప్రయాణీకుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులను సాధారణ పనివేళలకు మించి పొడిగించాలని అధికారులు నిర్ణయించిన మీదట శుక్రవారం సర్వీసులను అర్ధరాత్రి వరకూ నిర్వహించారు. దీని ప్రకారం సాధారణ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన రైల్ సేవలు.. సెప్టెంబరు 10వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకూ నడిచాయి. ఈ క్రమంలో చివరి మెట్రో రైలు సెప్టెంబరు 10వ తేదీ అర్ధరాత్రి 1 గంటకు సంబంధిత స్టేషన్ల నుండి బయలుదేరి సంబంధిత టెర్మినేటింగ్ స్టేషన్‌లకు సుమారు 2 గంటలకు చేరుకుంది.
ఇక మెట్రో వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్- ఎల్‌బీనగర్ కారిడార్‌లో 2.46 లక్షల మంది, నాగోల్-రాయదుర్గం కారిడార్‌లో 1.49 లక్షల మంది ప్రయాణించారు. ఇక అత్యధికంగా ఖైరతాబాద్ మెట్రోస్టేషన్‌లో 62 వేల మంది ఫుట్, ఫాల్ నమోదైందని, దీనిలో 40 వేల మంది రైలు దిగగా, ఇదే స్టేషన్‌లో 22 వేల మంది రైలు ఎక్కారని తెలిపారు. అలాగే జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్‌లో 22 వేల మంది ప్రయాణించారని వెల్లడించారు. ఇక హైదరాబాద్ మెట్రో పరంగా ఇదే హయ్యెస్ట్ రికార్డు అని మెట్రో అధికారులు తెలియజేశారు. దీంతో గణేష్ నిమజ్జనం నేపథ్యంలో మెట్రో అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాన్నిచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటు ప్రయాణీకుల సౌకర్యంతో పాటు అటు మెట్రో కూడా రికార్డు స్థాయిలో ఆదాయం అందుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY