నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేయాలి – బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్

BJP MLA Etela Rajender Demands CM KCR To Form Chakali Ilamma Statue on Tank Bund Hyderabad, BJP MLA Etela Rajender Chakali Ilamma Statue , Etela Rajender Demands CM KCR For Chakali Ilamma Statue, Chakali Ilamma Statue on Tank Bund, Mango News, Mango News Telugu, Chakali Ilamma Statue, Tank Bund Hyderabad, Chakali Ilamma Statue Latest News And Updates, BJP MLA Etela Rajender, MLA Etela Rajender, Chakali Ilamma Statue on Tank Bund Hyderabad, Etela Rajender News And Live Updates, Etela Rajender

నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. శనివారం ఆయన మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్‌లో పర్యటించారు. తెలంగాణ ఉద్యమకారుల్లో ఒకరిగా గుర్తింపు కలిగిన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నేడు ఈటల రాజేందర్ చౌటుప్పల్‌లోని ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక బిజెపి కార్యాలయంలో ఎమ్మెల్యే ఈటల మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌ బండ్‌పై ఏర్పాటు చేయాలని, అలాగే తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల చిహ్నంగా స్తూపం నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నాడు అమర వీరుల కుటుంబాలను ఆదుకుంటామని ఎన్నో మాటలు చెప్పారని, కానీ ఇంతవరకు వారికి ఎలాంటి న్యాయం చేయలేదని మండిపడ్డారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న కేసీఆర్‌ ముందు రాష్ట్రంలో ప్రజలను పట్టించుకోవాలని సూచించారు. విభజన జరిగినప్పుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను నేడు అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని, దేశంలో తెలంగాణను అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని తీవ్ర విమర్శలు చేశారు. ఉపఎన్నిక వస్తేనే ముఖ్యమంత్రికి ప్రజలు గుర్తుకు వస్తారని, కానీ ఇప్పుడు మునుగోడు ప్రజలు ఆయన మాటలను నమ్మే పరిస్థితి లేదని, ఇక్కడ రాజగోపాల్ రెడ్డిని గెలిపించడానికి వారు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 7 =