హైదరాబాద్‌లో పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు ఉచిత శిక్షణ కోసం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. పోలీసు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న యువతకు ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. పోలీసు శాఖలో ఉద్యోగం కోసం తీవ్రమైన పోటీ ఉంటోందని, ప్రతిసారీ లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని, అయితే పోలీసు ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ, ప్రణాళిక అవసరమని ఆనంద్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అయిదు జోన్లలో పోలీస్ ఉద్యోగాల ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్‌కు 21 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
అయితే దరఖాస్తులు ఎక్కువగా రావడంతో మంగళవారం అయిదు జోన్ల పరిధిలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆనంద్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరు కావాలని స్పష్టం చేశారు. ఈ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించినవారు ఉచిత శిక్షణకు అర్హత సాధిస్తారని తెలిపారు. వారి ఫోన్లకు ఎస్సెమ్మెస్ రూపంలో హాల్ టికెట్ కు సంబంధించిన సమాచారం వస్తుందని, అలాగే హైదరాబాద్ సిటీ పోలీస్ వెబ్సైట్, సిటీ కమిషనర్ వెబ్‌సైట్‌తో పాటు నగర పోలీస్ ఫేస్బుక్ పే జీ, ట్విట్టర్ లలో పూర్తి సమాచారం లభిస్తుందని తెలిపారు. కాగా రేపటి ఈ పరీక్షకు అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు వాటర్ బాటిల్, మాస్కు తప్పనిసరిగా తెచ్చుకోవాలని కూడా వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ