వికారాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి, పలువురికి గాయాలు

Road Accident In Vikarabad District: 5 Dead and Several Injured,Mango News,Mango News Telugu,Road Accident In Vikarabad District,Vikarabad,Vikarabad District,Road Accident In Vikarabad,Road Accident,Vikarabad District Road Accident,Vikarabad Road Accident,Vikarabad Road Accident News,Vikarabad News,Telangana,Road Accident In Telangana,Vikarabad Road Accident Kills 5,Telangana Road Crash Involving Auto,Truck And Bus Kills 5,Three Critical,Telangana Road Crash,Vikarabad Road Crash,Telangana Accident News,Mominpet,Chintapalli village,Road Accident Chittampally,Road Accident In Vikarabad 5 Dead

వికారాబాద్‌ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోమిన్ పేట్ మండలం ఇజ్రాచిట్టెంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీ కొన్నాయి. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారిగా మధ్యలో ఆగిఉన్న ఆటోని ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత ఎక్కువుగా ఉంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడినట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భారీగా ఉన్న పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − fifteen =