హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం కానున్న హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్.. ఆమోదం తెలిపిన బోర్డు

Mortgage Lender HDFC Ltd and HDFC Bank Announce Merger, Mortgage Lender HDFC Ltd, HDFC Bank, DFC Bank Announce Merger With Mortgage Lender HDFC Ltd, HDFC Ltd, India's largest private lender HDFC Bank will merge with housing finance firm HDFC Ltd, India's largest private lender HDFC Bank, housing finance firm HDFC Ltd, HDFC Bank And housing finance firm HDFC Ltd to merge, housing finance firm HDFC Ltd, housing finance firm HDFC Ltd to merge With HDFC Bank, HDFC Bank And HDFC Ltd announce merger, HDFC Ltd-HDFC Bank merger, HDFC Ltd-HDFC Bank merger Latest News, HDFC Ltd-HDFC Bank merger Latest Updates, Mortgage Lender, Mortgage housing finance Lender, Mango News, Mango News Telugu,

దేశంలో అతి పెద్ద మోర్టగేజ్‌ రుణ సంస్థ హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్‌డీఎఫ్‌సీ), ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విలీనం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ మరియు హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్ లిమిటెడ్‌లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తో విలీనానికి ఏప్రిల్ 4, సోమవారం నాడు తమ బోర్డు ఆమోదంతెలిపినట్టు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ ప్రకటించింది. తాజా విలీన ప్రకటనతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 10%, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ షేర్లు 13% వరకు పెరిగాయి. విలీనం అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో 41 శాతం వాటా హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ కు లభించనుంది.

మరోవైపు విలీన ప్రతిపాదనలో నాన్-ఆపరేటివ్ ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీని సృష్టించే ఆలోచన లేదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఛైర్మన్ అటాను చక్రవర్తి తెలిపారు. ఈ విలీనంపై హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ చైర్మన్ దీపక్ పరేఖ్ స్పందిస్తూ, ఇది సమానుల విలీనమని పేర్కొన్నారు. దీని ద్వారా ఆర్థిక వ్యవస్థలో క్రెడిట్ వృద్ధి వేగాన్ని వేగవంతం చేయడం, గృహాలను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచడం, వ్యవసాయ రంగానికి క్రెడిట్‌ తో సహా ప్రాధాన్యతా రంగాలకు రుణ పరిమాణాన్ని పెంచే అవకాశం ఉంటుందని అన్నారు. ఇక విలీనం అనంతరం దేశంలో మూడో అతి పెద్ద బ్యాంకుగా హెచ్‌డీఎఫ్‌సీ అవతరించే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =