హైదరాబాద్: సస్పెన్షన్‌కు గురైన గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మళ్ళీ అరెస్ట్‌

Hyderabad Suspended Goshamahal BJP MLA Raja Singh Arrested Again Today, Telangana Goshamahal BJP MLA Raja Singh Arrested Again Today, Suspended Goshamahal BJP MLA Raja Singh, BJP MLA Raja Singh Arrested Again, MLA Raja Singh Arrested, Goshamahal BJP MLA Raja Singh, BJP MLA Raja Singh, MLA Raja Singh Arrest, Telangana BJP MLA T Raja Singh, MLA Raja Singh Arrest News, MLA Raja Singh Arrest Latest News And Updates, MLA Raja Singh Arrest Live Updates, Mango News, Mango News Telugu,

సస్పెన్షన్‌కు గురైన గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద తెలంగాణ పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. ఒక వర్గాన్ని కించపరిచేలా రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో.. గత రెండు, మూడు రోజులుగా హైదరాబాద్ నగరంలో భారీ నిరసనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇవే ఆరోపణలపై బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం కూడా విదితమే. ఈ క్రమంలో మొదట పోలీసులు అరెస్ట్ చేయగా, కోర్ట్ సాంకేతిక కారణాలను చూపుతూ బెయిల్ మంజూరు చేయడం, అరెస్ట్ అయిన కొద్దీ గంటల్లోనే రాజాసింగ్ విడుదలవడం వరుసగా జరిగిపోయాయి. అయితే నాంప‌ల్లి కోర్టు రాజాసింగ్ రిమాండ్‌ను తిర‌స్క‌రించ‌డంపై హైదరాబాద్ పోలీసులు హైకోర్టులో స‌వాలు చేశారు. పోలీసుల రిమాండ్ పిటిష‌న్‌పై హైకోర్టు రేపు విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

ఇదిలా ఉండగా గురువారం ఉదయం తాజాగా ఫిబ్రవరి, ఏప్రిల్‌లో నమోదైన కేసులకు సంబంధించి మంగళ్‌హాట్‌, షాహినాయత్‌ గంజ్‌ పోలీసులు రాజాసింగ్‌కు 41(A) సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయనను మరోసారి అరెస్ట్‌ చేసి నాంపల్లి కోర్టుకు తరలించారు. ఇక రాజాసింగ్ అరెస్ట్ సందర్భంగా ఆయన ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజాసింగ్‌ మద్దతుదారులు, అనుచరులు గుమికూడటంతో ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. ఆయన ఇంటికి వెళ్లే దారిలో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY