యూఎస్ లో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఇండో-అమెరికన్ అరుణా మిల్లర్ ఎన్నిక, కంగ్రాట్స్ చెప్పిన మంత్రి కేటీఆర్

Indian-American Politician Aruna Miller Elected as Lieutenant Governor of Maryland Minister KTR Congratulated her, Aruna Miller, Lieutenant Governor of Maryland,Minister KTR Congratulated,Mango News,Mango News Telugu,Indian-American Politician Aruna Miller,Maryland Lieutenant Governor Aruna Miller,Maryland Lieutenant Governor,Lieutenant Governor Aruna Miller,Aruna Miller Latest News And Updates, Telangana Minister KTR

ఇండో-అమెరికన్ రాజకీయవేత్త అరుణా మిల్లర్ అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికై చరిత్ర సృష్టించింది. అరుణా మిల్లర్ 1964, నవంబర్ 6న హైదరాబాద్‌లో జన్మించారు. కాగా ఆమెకు ఏడేళ్ల వయసులో మిల్లర్ కుటుంబం అమెరికాకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడింది. ఇటీవల అమెరికాలో జరిగిన మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో అధికార డెమోక్రటిక్‌ పార్టీ తరఫున మేరీల్యాండ్‌ రాష్ట్రానికి గవర్నర్‌ పదవీకి వెస్‌ మూర్‌, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పదవీకి అరుణా మిల్లర్‌ పోటీచేసి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులపై విజయం సాధించారు. కాగా ప్రచార సమయంలో వీరికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరియు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మద్దతుగా నిలిచారు. అమెరికా రాష్ట్రాల్లో గవర్నర్ తర్వాత, లెఫ్టినెంట్ గవర్నర్ పదవీ అత్యంత సీనియర్ అధికారులలో ఒకరిగా ఉంది. ఈ నేపథ్యంలో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా అరుణా మిల్లర్ ఎన్నికవడంపై దేశంలోని పలువురు నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, “మేరీల్యాండ్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికైన అరుణా మిల్లర్ అభినందనలు. హైదరాబాద్‌లో పుట్టిన ఆమె, ఇప్పుడు అమెరికాలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు” అని పేర్కొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తూ, “తెలుగు కుమార్తె అరుణా మిల్లర్ మేరీల్యాండ్‌కు మొదటి ఇండో-అమెరికన్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికవడం ద్వారా చరిత్రను లిఖించినందుకు చాలా ఆనందంగా ఉంది. యూఎస్‌లో ఈ కీలక పదవిలో పనిచేయబోతున్న మొదటి దక్షిణాసియా మహిళ ఆమె. అరుణమిల్లర్ కు అభినందనలు, మరియు ఆల్ ది బెస్ట్” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE