చండీగఢ్‌లోని ప్రముఖ పీజీఐ హాస్పిటల్‌ను సందర్శించిన మంత్రి హరీష్ రావు.. సదుపాయాలు, వైద్యసేవల పరిశీలన

Telangana Health Minister Harish Rao Visits PGI Hospital in Chandigarh Today, Health Minister Harish Rao Visits PGI Hospital in Chandigarh Today, Minister Harish Rao Visits PGI Hospital in Chandigarh Today, Telangana Health Minister Visits PGI Hospital in Chandigarh Today, Harish Rao Visits PGI Hospital in Chandigarh Today, PGI Hospital in Chandigarh, Chandigarh PGI Hospital, PGI Hospital, Chandigarh, Telangana Health Minister Harish Rao, Health Minister Harish Rao, Telangana Health Minister, Harish Rao, Chandigarh PGI Hospital News, Chandigarh PGI Hospital Latest News, Chandigarh PGI Hospital Latest Updates, Chandigarh PGI Hospital Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రతిష్టాత్మక చండీగఢ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్‌ను సందర్శించారు. ఈ మేరకు చండీగఢ్‌లో జరుగుతున్న రెండు రోజుల జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో పాల్గొనడానికి నిన్న చండీగఢ్‌ వెళ్లిన ఆయన బుధవారం ఈ ప్రముఖ హాస్పిటల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా పీజీఐ హాస్పిటల్‌ డైరెక్టర్ డాక్టర్ వివేక్ లాల్ మంత్రికి స్వాగతం పలికారు. హాస్పిటల్‌ డీన్ డాక్టర్ పురి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వివేక్ కౌశల్ దగ్గరుండి ఆస్పత్రిలోని సదుపాయాలను, అందిస్తున్న వైద్యసేవల గురించి మంత్రి హరీష్ రావుకి వివరించారు.

ఇక ఇదే సమయంలో తెలంగాణ వైద్య రంగంలో అమలు చేస్తున్న గుణాత్మక మార్పుల గురించి హరీష్ రావు పీజీఐ ప్రముఖులకు వివరించారు. ప్రతిష్టాత్మక ‘నిమ్స్’ హాస్పిటల్ విస్తరణ, కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘టిమ్స్’ హాస్పిటల్ గురించి వారికి తెలిపారు. అలాగే రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులలో ఇంకా మెరుగైన వసతులు కల్పించడానికి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకున్నారు. కాగా మంత్రి హరీష్ రావుతో పాటు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, సీఎం ఓఎస్డీ గంగాధర్, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ కూడా పీజీఐ హాస్పిటల్‌ను సందర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 13 =