తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లవుతున్నా పునర్విభజన చట్టంలోని హామీలు ఇంకా నెరవేర్చలేదు – మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

Minister Errabelli Dayakar Rao Questions PM Modi Over Pending Issues Regarding Bifurcation Act in Telangana,Minister Errabelli Dayakar Rao,PM Narendra Modi, Telangana Bifurcation Act,Mango News,Mango News Telugu,Errabelli Dayakar Rao Questions PM,Pending Issues Regarding Bifurcation,Telangana Bifurcation,Andhra Pradesh Bifurcation,Andhra Pradesh,Telangana,Andhra Pradesh Latest News And Updates, AP CM YS Jagan Mohan Reddy,Telangana CM KCR,Indian PM Modi

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేళ్లవుతున్నా ఇప్పటికీ పునర్విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణకు ప్రధాని మోదీ రావడాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ ఈ ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి ఆయన ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ పనితీరుకు కేంద్రం నుంచి అవార్డులు అయితే వచ్చాయి కానీ నిధులు మాత్రం రాలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని, ఉత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా రూ.వెయ్యి కోట్ల వరకు కోత విధించిందని మండిపడ్డారు.

ఉపాధి హామీ పథకంలో లొసుగులేమైనా ఉన్నాయేమోనని తెలుసుకునేందుకు 18 కేంద్ర బృందాలు రాష్ట్రానికి వచ్చాయని, కానీ చివరికి ఏమీ తేల్చలేకపోయాయని మంత్రి దయాకర్‌రావు చెప్పారు. అయితే, పనులకు అనుమతి తీసుకోలేదని తెలిపాయని, రాష్ట్రంలో మొక్కలు నాటేందుకు కూడా కేంద్రం అనుమతి తీసుకోవాలా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో పథకాలకు కేంద్రం నిధులివ్వ డం లేదని, ఉపాధి హామీ పథకానికి తెలంగాణలో రూ.800 కోట్ల కోత విధించిందని ఆరోపించారు. అలాంటిది ఇప్పుడు ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏం చేశారని వస్తున్నారని ప్రశ్నించారు. 2014లో మోదీ ప్రధాని కాకముందు రూ.450గా ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర నేడు రూ.1200కు చేరిందని, అలాగే ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మంత్రి మండిపడ్డారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలతో కొనాలని బీజేపీ ప్రయత్నించిందని, అయితే మునుగోడు ప్రజలు ఆ పార్టీకి సరైన గుణపాఠం చెప్పారని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. అలాగే గవర్నర్‌గా ఉన్నవారు రాజకీయాలు చేయొద్దని, ప్రభుత్వం ఎక్కడా ఎలాంటి పొరపాట్లు చేయడం లేదని దయాకర్‌రావు అన్నారు. ఇక ఇదిలా ఉండగా మరోవైపు తెలంగాణలో ఐటీ, ఈడీ దాడుల నేపథ్యంలో సీఎం కేసీఆర్.. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలను ప్రగతిభవన్కు పిలిపించారు. జరుగుతున్న పరిణామాలపై చేపట్టాల్సిన చర్యలపై సమాలోచనలు చేస్తున్నారు. ఇక గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతల ఇళ్లు, పరిశ్రమల్లో ఐటీ, ఈడీ దాడులు చేస్తోన్న విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 11 =