
భారతదేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా భాగ్యనగరం ఖ్యాతి రోజు రోజుకు పెరుగుతోంది. ఐటీ, ఫార్మా రంగాలకు కేరాఫ్ అయిన హైదరాబాద్..ఇప్పుడు భారత దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా వరల్డ్ వైడ్‌లో గుర్తింపు పొంది మరో మైలురాయిని చేరుకుంది. ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్ యొక్క భౌగోళిక స్వరూపం, శీతోష్ణస్థితి పరిస్థితులు ఈ నగరాన్ని మరింత విశిష్టంగా మార్చడానికి సహాయపడుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ‘ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2024′ పేరుతో రిలీజ్ చేసిన నివేదికలో హైదరాబాద్ ప్రపంచస్థాయి సిటీల లిస్టులో చోటును సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ 564వ స్థానంలో ఉంది. గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ రిలీజ్ చేసిన జాబితా ప్రకారం ప్రపంచంలోని అగ్ర నగరాల జాబితాలో.. ఢిల్లీ గ్లోబల్ ర్యాంక్ 350 సాధించి.. ఇండియాలో తొలిస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ జాబితాలో న్యూయార్క్ అగ్రస్థానంలో ఉంది.
స్వతంత్ర ఆర్థిక సలహా సంస్థ ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ ర్యాంక్ ఇచ్చిన భారతదేశంలోని టాప్-10 నగరాల జాబితాలో హైదరాబాద్ 9వ స్థానంలో నిలిచింది. ఎకనామిక్స్, హ్యూమన్ క్యాపిటల్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, పర్యావరణం, ప్రభుత్వ పాలన అనే నాలుగు అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్ రూపొందించబడ్డాయి. నాలుగు ఇండెక్స్‌లో హైదరాబాద్ ఎకనామిక్స్‌లో అత్యుత్తమ పనితీరు కనబరించింది.నాలుగు అంశాల ఆధారంగా హైదరాబాద్ నగర ప్రపంచ ర్యాకింగ్స్‌ను గమనిస్తే..ఎకనామిక్స్‌లో 253 వ ర్యాంక్, హ్యుమన్ క్యాపిటల్‌లో 524 ర్యాంక్, జీవన నాణ్యతలో 882 వ ర్యాంక్, పర్యావరణంలో 674 వ ర్యాంక్ పొందింది.
అలాగే భారతదేశంలోని టాప్ టెన్ నగరాల జాబితాలు, వాటి ప్రపంచ ర్యాకింగ్స్ చూసుకుంటే.. 350 ర్యాంకింగ్ సాధించి ఢిల్లీ మొదటిప్లేసులో ఉంది.411 తో బెంగళూరు రెండో ప్లేసులో..427 ర్యాంకింగ్‌తో ముంబై మూడో ప్లేసులో ఉంది. అలాగే 472 ర్యాంక్‌తో చెన్నై నాలుగో ప్లేసు, 521 ర్యాంకింగ్‌తో కొచ్చి ఐదోప్లేసులలో సెటిలయ్యాయి. ఇట 528 ర్యాంకింగ్‌తో కోల్ కతా ఆరోప్లేస్, 534 ర్యాంకింగ్‌తో పూనే ఏడో ప్లేసులో, 550 ర్యాంకింగ్‌తో త్రిసూర్ 8వ ప్లేసులో ఉన్నాయి.అంతేకాదు 564 ర్యాంకింగ్‌తో హైదరాబాద్ తొమ్మిదో ప్లేసు, 580ర్యాంకింగ్‌తో కోడికోడ్ 10వ స్థానంలో ఉన్నట్లు ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ జాబితాను రిలీజ్ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY