
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో పొలిటికల్ వాతావరణం హీటెక్కుతోంది. రోజురోజుకు అక్కడ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా మల్రెడ్డి రంగారెడ్డి,బీజేపీ అభ్యర్థిగా దయానంద్ గౌడ్ బరిలోకి దిగారు.సీపీఎం పార్టీ నుంచి యాదయ్య పోటీ చేస్తుండగా..ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చాలా వేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు
ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల మధ్యలో పోటీ ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ముఖ్య నాయకుడైన దండం రామ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసి.. చివరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరి గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతోనే ఇక రంగారెడ్డికి గడ్డుకాలం ప్రారంభం అయినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే మల్రెడ్డి రంగారెడ్డి ఒంటెద్దు పోకడలతో కాంగ్రెస్ వర్గాలలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. సొంతప్రయోజనాల కోసం తన సోదరుడైన రామ్ రెడ్డికి అన్ని విధాలా పూర్తి బాధ్యతలు అప్పజెప్పారన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. దీంతోనే కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గ్రహించి బీఆర్ఎస్ పార్టీ వైపు తొంగి చూస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మంచి రెడ్డి కిషన్ రెడ్డిపై.. స్వతంత్ర అభ్యర్థిగా మల్రెడ్డి రంగారెడ్డి పోటీ చేశారు. మల్రెడ్డి రంగారెడ్డి అప్పుడు 314 అతి స్వల్ప ఓట్లతో ఓటమి పాలవడంతో.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలుపొందారు.
మరోవైపు ఎన్నికల సమయంలో తప్ప మల్రెడ్డి రంగారెడ్డి ప్రజల మధ్యలో ఎప్పుడూ ఉండరన్న వాదన అక్కడ బాగా వినిపిస్తోంది. ఆయన ఒంటెద్దు పోకడలతో అక్కడ తమ ప్రాధాన్యత పోగొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాలమంది.. బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్న వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అంతేకాదు అక్కడ మిగిలిన సీనియర్లకు ఆయనపై వ్యక్తిగతంగా బీభత్సమైన వ్యతిరేకత ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మల్రెడ్డి రంగారెడ్డి.. రేపు ఎమ్మెల్యే అయితే.. పార్టీ కార్యకర్తలు, ఇతర నాయకులపై మరింత ఆజమాయిషీ చేస్తారని ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారట. అవసరం అయితే మల్రెడ్డి రంగారెడ్డి ఓటమి కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. మరి చూడాలి మల్లెడ్డి జాతకాన్ని అక్కడి ఓటర్లు, సొంత పార్టీ నేతలు ఎలా డిసైడ్ చేస్తారో?.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE