ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టిన వివాదంలో.. నటి డింపుల్‌ హయతీపై కేసు నమోదు

Hyderabad Case Filed Against Actress Dimple Hayathi at Jubilee Hills Police Station as She Hitting IPS Officers Car,Hyderabad Case Filed Against Actress Dimple Hayathi,Actress Dimple Hayathi at Jubilee Hills,Dimple Hayathi at Jubilee Hills Police Station,Dimple Hayathi Hitting IPS Officers Car,Mango News,Mango News Telugu,Tollywood actor Dimple Hayathi,Dispute with IPS Officer,Hyderabad Latest News,Police case filed against the Khiladi actress,Dimple Hayathi,Actress Dimple Hayathi,Actress Dimple Hayathi Latest News,Actress Dimple Hayathi Latest Updates,Dimple Hayathi News Today,Hyderabad Latest News and Updates

టాలీవుడ్‌ నటి డింపుల్‌ హయతీ అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎస్‌ అధికారికి చెందిన కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతోపాటు పార్కింగ్‌ స్థలంలో అడ్డంకులు సృష్టిస్తున్నారనే నెపంపై ఆమెపై కేసు నమోదైంది. ఈ ఘటనలో హయతీతో పాటు ఆమె స్నేహితుడు విక్టర్‌ డేవిడ్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. అసలేమైందంటే.. హైదరాబాద్‌లోని జర్నలిస్ట్‌ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్‌కేఆర్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్స్‌లో నగర ట్రాఫిక్‌ విభాగంలో డీసీపీగా పనిచేస్తున్న ఐపీఎస్‌ అధికారి రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నంబర్‌ సీ(2)లో టాలీవుడ్‌ నటి డింపుల్‌ హయతీ కూడా తన స్నేహితుడు డేవిడ్‌తో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే భవనానికి చెందిన పార్కింగ్‌ స్థలంలో పార్క్‌ చేసిన ట్రాఫిక్ డీసీపీకి చెందిన అధికారిక వాహనానికి అడ్డుగా డింపుల్‌ హయతీ, విక్టర్‌ డేవిడ్‌లు తమ బీఎండబ్ల్యూ కారును పార్క్ చేస్తున్నారు. తమ కారును తీసేందుకు వీలుగా కారు పార్క్‌ చేసుకోవాలని చెప్పినా వినిపించుకోకుండా పలుమార్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో పలుమార్లు వారి మధ్య ఈ విషయమై వాగ్వివాదం జరిగింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈనెల 14న రాత్రి మరోసారి ఐపీఎస్‌ అధికారి వాహనాన్ని డేవిడ్ పార్కింగ్ ప్లేస్‌లో ఢీ కొట్టాడు. దీనిపై రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ ప్రశ్నించగా.. డింపుల్‌ హయతీ కారును కాలితో తన్నుతూ నానా రచ్చ చేసింది. దీనిపై కానిస్టేబుల్‌ చేతన్‌ కుమార్‌ మూడురోజుల కిందట జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో డింపుల్‌ హయతీతో పాటు ఆమె స్నేహితుడు విక్టర్‌ డేవిడ్‌పై కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు.. సోమవారం హీరోయిన్‌ డింపుల్‌ హయతీ, విక్టర్‌ డేవిడ్‌లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీఆర్‌పీసీ 41(ఏ) కింద నోటీసులు ఇచ్చి పంపించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద డింపుల్‌పై 353, 341, 279 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. కాగా నటి డింపుల్ ఇప్పుడే కాదని, గతంలో కూడా పలుమార్లు ఇలాగే ప్రవర్తించిందని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + eight =