ఓడలు బళ్లు అవుతాయి.. బళ్లు ఓడలు అవుతాయి అనే సామెత అందరికీ తెలిసే ఉంటుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలకు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. మొన్నటి వరకు కూడా ఈ ఇద్దరు రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. 2014 నుంచి 20223 వరకు వరుసగా రెండుసార్లు కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2019 నుంచి 2024 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పని చేశారు. కానీ ఒక్కసారిగా వీరిద్దరి కథ అడ్డం తిరిగింది. ఇద్దరూ గద్దె దిగిపోయారు. రాష్ట్రాలను అభివృద్ధి చేశాం.. ప్రజలకు ఎంతో మేలు చేశామని ఆ ఇద్దరు నేతలు పదే పదే చెప్పుకొచ్చినప్పటికీ వారికి ఓటమి తప్పలేదు.
వాస్తవానికి జగన్, కేసీఆర్‌ల మధ్య 2014 కంటే ముందు నుంచి కూడా మంచి రిలేషన్ షిప్ ఉంది. 2014లో తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. కానీ అనూహ్యంగా అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. అయిదేళ్లు తర్వాత తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. ఏపీలో మాత్రం వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి కేసీఆర్ కూడా హాజరయ్యారు. అలా ఎన్నో ఏళ్లుగా కేసీఆర్, జగన్‌ల మధ్య రాజకీయ బంధం కొసాగుతూనే ఉంది.
ప్రస్తుతం ఆ ఇద్దరు నేతలు రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2023లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి.. కాంగ్రెస్ గెలుపొందింది. పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ గద్దె దిగిపోయింది. అటు ఏపీలో కూడా ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలయింది. కేవలం 11 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. గతంలో 151 స్థానాల్లో గెలుపొందిన వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలుపొందడం తీవ్ర చర్చనీయాంశమయింది. అయితే త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకు ఓడిపోయాం.. ముందు ముందు ఏం చేయాలి అనే విషయాలపై జగన్, కేసీఆర్ సమావేశమై చర్చించనున్నట్లు తెలుస్తోంది. లోతు వరకు వెళ్లి అధ్యయనం చేస్తారని.. అలాగే పలు కీలక అంశాలపై చర్చిస్తారని సంబంధిత వర్గాలు అంటున్నాయి. రెండు, మూడు వారాల్లో జగన్, కేసీఆర్‌ల భేటీ ఉంటుందని చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE