ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థుల కోసం ఏపీ కెరీర్‌ పోర్టల్ ప్రారంభం‌

Andhra Pradesh, Andhra Pradesh Career Portal, AP Career Portal, AP Career Portal for Students, AP Government, AP Govt Jobs 2020, Career Portal, Government jobs in Andhra Pradesh, Government jobs in Andhra Pradesh 2020, Training on AP Career Portal

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో విద్యార్థులకు విద్య, ఉద్యోగ, ఉపాధి కోర్సుల వివరాలను తెలియజేసేందుకు “ఏపీ కెరీర్‌ పోర్టల్‌.ఇన్‌” ను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో 9 వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు చదువుకు సంబంధించిన అంశాలతో పాటుగా భవిష్యత్‌లో వారు ఎంచుకోబోయే ఉపాధి కోర్సులు, వాటిద్వారా వారు పొందబోయే ఉద్యోగాల వివరాలను ఈ https://apcareerportal.in/ పోర్టల్ ద్వారా తెలియజేస్తున్నారు. 20 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ పోర్టల్‌ ఉపయోగపడనుంది. ఏపీఎస్‌సీఈఆర్‌టీ, యూనిసెఫ్, ఆస్మాన్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈ పోర్టల్ ను నిర్వహించనున్నారు. ఏపీ కెరీర్‌ పోర్టల్‌.ఇన్‌ లో విద్యార్థులు తమ చైల్డ్‌.ఇన్‌ఫో ద్వారా రిజిస్టర్‌ అయ్యి, ప్రొఫైల్ వివరాలను‌ నమోదు చేయాలని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + six =