జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలో రేపు జరగాల్సిన పరీక్షలు వాయిదా

JNTU Hyderabad Postponed Examinations Several Exams Scheduled on SEP 29th

గులాబ్ తుఫాన్ ప్ర‌భావంతో తెలంగాణ‌ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ పరిధిలో సెప్టెంబర్ 27, 28 తేదీల్లో జరగాల్సిన పలు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా జేఎన్టీయూ పరిధిలో సెప్టెంబర్ 29, బుధవారం జరగాల్సిన బీటెక్‌/బీఫార్మ‌సీ/పార్మ్.డి/పార్మ్.డి (పీబీ) రెగ్యులర్ మరియు స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను కూడా వాయిదా వేస్తున్న‌ట్లు జేఎన్టీయూ రిజిస్టార్ ప్రకటించారు. కాగా సెప్టెంబర్ 30 నుంచి జరగాల్సిన మిగతా అన్ని పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని, వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి రీషెడ్యుల్ ను త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ