జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో 2018-19 విద్యాసంవత్సరానికి గాను ఇంజినీరింగ్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం ఫైనలియర్ చదువుతున్న ఈ విద్యార్థులకు పరీక్షలలో గ్రేస్ మార్కులు అందించనున్నారు యూనివర్సిటీ అధికారులు. ఈ మేరకు జేఎన్‌టీయూ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ (వీసీ) కట్టా నరసింహారెడ్డి ప్రకటన చేశారు. వీరికి ఫైనల్ ఎగ్జామ్స్ లో 3 సబ్జెక్టులకు 15 గ్రేస్ మార్కులు చొప్పున అదనంగా ఇస్తామని, దీనిని సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఇప్పటికే దీనిపై వర్సిటీ రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేశామని, మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడుతుందని నరసింహారెడ్డి పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా గత రెండు, మూడేళ్ళుగా సరిగా క్లాసులు జరగకపోవడం, ప్రణాళిక మేరకు విద్యాబోధన కొనసాగకపోవడం వంటి కారణాల వలన ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎక్కువగా పరీక్షల్లో ఫెయిలైనట్లు గుర్తించామని, వీరిని దృష్టిలో పెట్టుకొనే మూడు సబ్జెక్టులకు కలిపి 15 గ్రేస్ మార్కులు అందించాలని నిర్ణయించుకున్నామని వీసీ వెల్లడించారు. తద్వారా ఫెయిలైన వారిలో దాదాపు 4,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని, మూడు సబ్జెక్టులకు 15 గ్రేస్ మార్కులు కలుపడం వలన వీరంతా పాసయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిలైన విద్యార్థులు దాదాపు 10 వేల మంది వరకు ఉంటారని, వీరికి కూడా ప్రత్యేక పరీక్షలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వీసీ నరసింహారెడ్డి చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE