తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇన్‌ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) జస్టిస్ ఎం.ఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ హిమా కోహ్లి తెలంగాణ సీజేగా బాధ్యతలు విరమించుకున్న తేదీ నుండి అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న రామచంద్రరావు తెలంగాణ సీజేగా బాధ్యతలు నిర్వర్తించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ