సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులెటిన్ విడుదల

KIMS Hospitals Released Health Bulletin on Condition of Noted Tollywood Lyricist Sirivennela Seetharama Sastry

ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురై సికింద్రాబాద్‏ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యపరిస్థితిపై కిమ్స్ హాస్పిటల్స్ తాజాగా హెల్త్‌ బులెటిన్ విడుదల చేసింది. “ప్రముఖ టాలీవుడ్ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 24న న్యూమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన నిపుణులైన వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు మరియు ఐసీయూలో ఉన్న ఆయన తగిన చికిత్సను పొందుతున్నారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం” అని బులెటిన్ లో పేర్కొన్నారు. మరోవైపు సిరివెన్నెల సీతారామశాస్త్రి త్వరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ