ఆ ముగ్గురిని టార్గెట్ చేసిన జగన్‌

Jagan Targeted Those Three People, Jagan Targeted Those Three, Those Three People Targeted, YS Jagan,Pawan Kalyan ,Bala krishna, Lokesh,Janasena, Pitapuram, YCP, TDP, BJP, Congress, Political News, Mango News, Mango News Telugu
YS Jagan,Pawan Kalyan ,Bala krishna, lokesh,Janasena, Pitapuram, YCP, TDP, BJP, Congress

త్వరలో రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్,   హిందూపురం నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ.. మంగళగిరి నుంచి నారా లోకేష్‌ పోటీ చేస్తున్నారు.  గెలుపుపై పూర్తి నమ్మకాన్ని ఉంచి ఆ దిశగానే పావులు కదుపుతున్నారు. ఏపీ సీఎం జగన్ రాబోయే ఎన్నికల బరిలో ఆ ముగ్గురిపై గురి పెట్టారన్న వార్తలు వినిపిస్తున్నాయి.  బాలకృష్ణపై టి.ఎన్  దీపికను, పవన్‌పై వంగా గీతను, లోకేష్‌పై కాండ్రు లావణ్యను నిలబెట్టారు. వారికి తమ వంతుగా పూర్తి మద్దతును అందిస్తూ..ఎలా అయినా ఈ ముగ్గురిని ఓడించాలన్న టార్గెట్ ఇవ్వడంతో ఈ ముగ్గురు మహిళా నేతలు  అదే పనిలో ఉన్నారు.

నిజానికి హిందూపురం టీడీపీ కంచుకోటగా చెబుతారు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు మూడుసార్లు విజయాన్ని సాధించారు. ఆ తర్వాత పాముశెట్టి రంగ నాయకులు, నందమూరి హరికృష్ణ, సీసీ వెంకటరాముడు, అబ్దుల్ గని కూడా టీడీపీ నుంచే గెలుపొందారు.

ఉమ్మడి రాష్ట్రంలో మాత్రమే కాదు రాష్ట్రం విడిపోయాక కూడా టీడీపీ అదే జోష్ ను కంటెన్యూ చేసింది.  2014, 19 ఎన్నికల్లో అక్కడ నుంచి విజయం సాధించిన బాలకృష్ణ..మరోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తున్నారు. అయితే ఈసారి ఎలా అయినా వైసీపీ జెండా ఎగురవేస్తామమంటూ బాలకృష్ణకు పోటీగా టీఎన్ దీపికను రంగంలోకి దింపారు సీఎం జగన్.

2014 ఎన్నికలలో నవీన్ నిశ్చల్‌.. 2019 ఎన్నికలలో మహ్మద్‌ ఇక్బాల్‌ను రంగంలోకి దింపినా వైఎస్సార్సీపీ బోణీ కొట్టలేకపోయింది. దీంతో ఈసారి  ఎలా అయినా దీపిక విజయాన్ని సాధించాలనే కసితో ఉన్నారు జగన్.   మహిళా సెంటిమెంట్‌తో ఓట్లు కొల్లగొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఏపీలో మరో ప్రతిష్టాత్మక నియోజకవర్గం అయిన మంగళగిరిలో 2019 ఎన్నికల్లో నారా లోకేష్‌పై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు.  అత్యంత కీలకమైన మంగళగిరిలో ఓటమిపాలవడం టీడీపీని కోలుకోలేని దెబ్బతీసింది.కానీ ఈ సారి ఎలా అయినా అక్కడ  విజయం సాధించాలని  పట్టుదలతో  లోకేష్‌ ఉన్నారు.  అటు వైసీపీ మాత్రం వ్యూహాత్మకంగా నారా లోకేష్‌పై  మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కుమార్తె లావణ్యను రంగంలోకి దింపింది. బలమైన రాజకీయ నేపథ్యంతో పాటు.. విద్యావంతురాలు, బీసీ సామాజికవర్గానికి చెందడం  ఆమెకు ప్లస్‌ పాయింట్‌ అవుతాయని జగన్ భావిస్తున్నారు.

ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ బరిలో దిగుతున్న పిఠాపురం పైన జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. సీనియర్‌ నేత, విద్యావేత్త, సౌమ్యురాలైన వంగా గీత అక్కడ  పోటీలో ఉన్నారు. జెడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేసిన వంగా గీతకు.. కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో మంచి పట్టు ఉంది. ఆర్థికంగానూ సామాజికంగానూ తిరుగులేని గీతతో .. పవన్‌కు చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నారు. టీడీపీ విషయంలో కాస్త ఆటు ఇటుగా ఉన్నా.. పవన్ విషయాన్ని  చాలా సీరియస్‌గా తీసుకోవడంతో పిఠాపురంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =