భారత్ vs న్యూజిలాండ్ తొలిటెస్టు డ్రా, విజయానికి వికెట్ దూరంలో నిలిచిన భారత్

First Test of India vs New Zealand in Kanpur Ends in a Draw, IND vs NZ, IND vs NZ 2021, India vs New Zealad Match, India vs New Zealad Match News, India vs New Zealad Match Updates, India vs New Zealand, India vs New Zealand 1st Test, India vs New Zealand 1st Test Day 5, India vs New Zealand 1st Test Day 5 Highlights, India Vs New Zealand 1st Test Ends, India-New Zealand test at Kanpur ends in draw, Kanpur Test, Mango News, The First Test of India vs New Zealand in Kanpur Ends in a Draw

కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తోలి టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజున భారత్ బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేక పోయారు. మరో వికెట్ దక్కించుకుంటే తొలిటెస్టు భారత్ ఖాతాలో చేరేది. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ లక్ష్యం 284 పరుగుల ఉండగా, 4/1 స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు‌ తొమ్మిది వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్ ఆటగాళ్లలో టామ్‌ లాథమ్‌(52), విలియం సోమర్‌విల్లే(36), కేన్ విలియంసన్ (24) పరుగులతో రాణించారు.

అయితే మరో వికెట్ తో భారత్ కు విజయం దక్కే చివరి సమయంలో రచిన్‌ రవీంద్ర (96 బంతుల్లో 18 పరుగులు), అజాజ్‌ పటేల్‌ (23 బంతుల్లో 2 పరుగులు) తడబడకుండా ఆడుతూ మ్యాచ్ ను డ్రా దిశగా నడిపించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, రవిచంద్రన్‌ అశ్విన్‌ 3, అక్షర్‌ పటేల్‌, ఉమేశ్ యాదవ్‌ చెరో వికెట్‌ చొప్పున పడగొట్టారు. ఇక ఈ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 105, రెండో ఇన్నింగ్స్ లో 65 పరుగులతో ఆకట్టుకున్నశ్రేయాస్ అయ్యర్ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ గా నిలిచాడు. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు ముంబయిలోని వాన్ ఖడే స్టేడియంలో డిసెంబర్ 3 నుంచి 7 వరకు జరగనుంది.

భారత్–న్యూజిలాండ్ తోలిటెస్టు వివరాలు:

భారత్ తోలి ఇన్నింగ్స్: 345-10

  • శ్రేయాస్ అయ్యర్ (105), శుభ్‌మన్‌ గిల్‌(52)
  • సౌథీ 5/69, జేమిసన్ 3/91

న్యూజిలాండ్ తోలి ఇన్నింగ్స్: 296-10

  • టామ్‌ లాథమ్‌(95), విల్ యంగ్ (89)
  • అక్సర్ పటేల్ 5/62, అశ్విన్ 3/82

భారత్ రెండవ ఇన్నింగ్స్: 234-7

  • శ్రేయాస్ అయ్యర్ (65), వృద్ధిమాన్ సాహా (61)
  • సౌథీ 3/75, జేమిసన్ 3/40

న్యూజిలాండ్ రెండవ ఇన్నింగ్స్: 165-9

  • టామ్‌ లాథమ్‌ (52), సోమర్‌విల్లే (36)
  • రవీంద్ర జడేజా 4/40, అశ్విన్ 3/35
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =