వీర జవాన్ మహేష్ అంత్యక్రియలు పూర్తి, పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు

Jawan Ryada Mahesh, Jawan Ryada Mahesh Last Rites, Komanapalli Village, Last Rites of Martyred Jawan Ryada Mahesh, Last Rites of Martyred Jawan Ryada Mahesh Completed, Martyred Jawan Ryada Mahesh, Martyred Jawan Ryada Mahesh Last Rites

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో వీరమరణం పొందిన జవాన్ ర్యాడా మహేష్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహేష్ స్వగ్రామమైన నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామంలోని వైకుంఠ ధామంలో అధికార సైనిక లాంఛ‌నాలతో అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి మ‌హేశ్ అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. వీర జవాన్ మహేష్ కు కడసారి వీడ్కోలు పలికేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.

ముందుగా మంగళవారం రాత్రి మహేశ్‌ పార్ధివదేహాన్ని ప్రత్యేక విమానంలో‌ బేగంపేట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. ఆ సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు వీర జవాన్ మహేష్ కు ఘన నివాళులు అర్పించారు. అనంతరం మహేశ్‌ పార్ధివదేహాన్ని కోమన్‌పల్లి గ్రామానికి తరలించారు. ఈ రోజు అంత్యక్రియల కార్యక్రమంలో ప్రజలు పెత్తఎత్తున పాల్గొని, మహేష్ కు కన్నీటి వీడ్కోలు పలికారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ