తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరగబోతున్నాయా..?

Like Karnataka RTC Bus Fares Are Going To Increase In Telangana Too,RTC Bus Fares Are Going To Increase In Telangana Too,RTC Bus Fares Are Going To Increase,RTC Bus Fares,Bus Fares Are Going To Increase In Telangana,Karnataka,Telangana,Free Bus,TGSTC, RTC Bus Charges, Revanth Reddy,,Live Updates,Politics,Political News, Mango News, Mango News Telugu
telangana, tgsrtc, rtc bus charges, revanth reddy

తెలంగాణ లో బస్సు ప్రయాణికుల ఫై భారం పడనుందా..? త్వరలోనే బస్సు ఛార్జ్ లు పెంచే అవకాశం ఉందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరన వెంటనే హామీ ఇచ్చినట్లుగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. అయితే మహిళల బస్స్ ఛార్జీలను ఆర్టీసీకి ప్రభుత్వమే రియంబర్స్ చేస్తుందని ప్రకటించింది. దీంతో ఆధార్ కార్డు చూపించిన మహిళలకు జీరో టికెట్ ఇస్తోంది. అయితే తెలంగాణ కంటే ముందు గానే కర్ణాటకలో ప్రీ బస్ పథకాన్ని అమలు చేసింది అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు అక్కడ ఆర్టీసీ రేట్లు పెంచనున్నట్లు కేఎస్ ఆర్టీసీ ప్రకటించింది. కేఎస్‌ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై కార్పొరేషన్ చైర్మన్, ఎస్.ఆర్. శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. టికెట్ ధర పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. అంతకుముందు 2019లో బస్సు టికెట్ ధరను పెంచారు. ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు టికెట్ ధర పెంచలేదు. చమురు ధరల పెరుగుదల కారణంగా ధరల పెంపు అనివార్యమైంది. జీతం పెంచి ఉద్యోగులకు ప్రివిలేజెస్ ఇవ్వాలంటే రేట్లు పెంచాల్సిందే అని అన్నారు. ప్రభుత్వ బస్సుల్లో చార్జీల పెంపు అనేది అనివార్యమని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌ ఎస్‌ఆర్‌ శ్రీనివాస్‌ స్వయంగా తెలిపారు. బస్సు చార్జీలను 15-20 పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేఎస్‌ఆర్టీసీ ఇప్పటికే ప్రతిపాదనలు పంపిందని వెల్లడించారు. బస్సు చార్జీలను 15-20 పెంచాలని మేం ప్రతిపాదనలు పంపాం. కేఎస్‌ఆర్టీసీ మనుగడ సాగించాలంటే, చార్జీల పెంపు తప్పనిసరి అని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

తెలంగాణ TGRTC కూడా అదే చేస్తుందని అంత భావిస్తున్నారు. కర్ణాటక లో ఎలాగైతే ఫ్రీ బస్సు పథకం తీసుకొచ్చారో..ఇక్కడ తెలంగాణ లో కూడా కాంగ్రెస్ అదే పని చేస్తుంది. దీంతో ఇక్కడ కూడా ఛార్జ్ లు పెరగడం ఖాయం అంటున్నారు. ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ప్రజలపై పన్నుల మోత మోగిస్తుంది. అనేక వాటిపై పన్నుల భారం మోపుతూ వస్తుంది. గైడెన్స్‌ వ్యాల్యూ ట్యాక్స్‌, అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ, రవాణా వాహనాలపై అదనపు సెస్‌, ఈవీలపై లైఫ్‌ టైమ్‌ ట్యాక్స్‌ను ఇబ్బడిముబ్బడిగా వసూలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం గత నెలలో పెట్రోల్‌, డీజిల్‌పై సేల్స్‌ ట్యాక్స్‌ను దాదాపు 4 శాతం చొప్పున పెంచింది. ఇక పాల ధరలను కూడా లీటర్‌, అర లీటర్‌ ప్యాకెట్లపై రూ.2 చొప్పున కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌(కేఎంఎఫ్‌) పెంచింది. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జ్ లు పెంచేందుకు సిద్ధమైంది.

ఇదే విషయాన్నీ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ కూడా చెప్పకనే చెప్పారు. ఉచితంగా ఇస్తామంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పందంటూ కాంగ్రెస్‌ పాలిత కర్ణాటకలో బస్సు చార్జీల పెంపు ప్రతిపాదన జరిగింది. బస్సు చార్చీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు ఎంతో దూరంలో లేదని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ లో కూడా జరగబోతుంది. ఇదే జరిగితే ప్రజలు తిరగబడడం ఖాయం. ఇప్పటికే ప్రజలు ఆగ్రహం తో ఊగిపోతున్నారు..ఇప్పుడు బస్సు ఛార్జి లు కూడా పెంచితే ప్రజలు రోడ్లపైకి రావడం గ్యారెంటీ అని కేటీఆర్ పేర్కొన్నారు. మరి రానున్న రోజుల్లో బస్సు చార్జీలు పెరగబోతున్నాయా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ