రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం

Cabinet Decides to Promote Oil Palm Cultivation, CM KCR On Methods To Increase Oil Palm Cultivation In The State, Fillip To Oil Palm Cultivation In Telangana, Focus on oil palm cultivation, Mango News, Methods To Increase Oil Palm Cultivation In The State, Oil Palm Cultivation, Oil Palm Cultivation In Telangana, Oil Palm Cultivation In Telangana State, Telangana Cabinet, Telangana Cabinet Decides to Promote Oil Palm Cultivation, Telangana Cabinet Decides to Promote Oil Palm Cultivation in the State, Telangana Oil palm cultivation

రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రానున్న 2022–23 సంవత్సరానికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టే దిశగా రైతులను చైతన్యపరిచి, ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతులకు ఎకరాకు, మొదటి సంవత్సరం రూ.26,000, రెండవ సంవత్సరం ఎకరాకు రూ.5000, మరియు మూడవ సంవత్సరం ఎకరాకు రూ.5,000 చొప్పున పంట పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అటవీ శాఖ, అటవీ అభివృద్ధి కార్పోరేషన్ తో పాటు పంచాయితీరాజ్ మరియు రూరల్ డెవలప్ మెంట్ శాఖల సహాయంతో ఆయిల్ ఫామ్ మొక్కల నర్సరీలను పెంచాలని కేబినెట్ సూచించింది.

ఆయిల్ ఫామ్ పంట విధానం గురించి మరింతగా తెలుసుకోవడానికి మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులతో కూడిన అధ్యయన బృందం కోస్టారికా, మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేషియా తదితర దేశాలలో పర్యటన చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అండ్ ఎంటర్ ప్రెన్యూయర్ అడ్వాన్స్మెంట్ (టిఐడిఈఏ), తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టిఎస్ఎఫ్ పిజెడ్) నిబంధనల ప్రకారం అందించే ప్రోత్సాహకాలు అందచేయాలని అధికారులకు కేబినెట్ సూచించింది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 8 =